Home /News /jobs /

TELANGANA JOBS GOOD NEWS FOR THE UNEMPLOYED INVITATION FOR APPLICATIONS FOR FREE TRAINING EVK

Telangana Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉచిత శిక్ష‌ణ‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం.. రెండు రోజులే చాన్స్

క్యూఆర్ కోడ్‌

క్యూఆర్ కోడ్‌

Telangana Police Job | తెలంగాణ ప్రభుత్వం భారీ ఉద్యోగ ప్రకటనకు సిద్ధమైంది. ముఖ్యంగా పోలీస్ ఉద్యోగాలను భారీ సంఖ్యలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 18,334 పోస్టులను త్వరలోనే భర్తీ చేయనుంది.

ఇంకా చదవండి ...
  తెలంగాణ (Telangana) ప్రభుత్వం భారీ ఉద్యోగ ప్రకటనకు సిద్ధమైంది. ముఖ్యంగా పోలీస్ ఉద్యోగాలను భారీ సంఖ్యలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 18,334 పోస్టులను త్వరలోనే భర్తీ చేయనుంది. ఈ నేపథ్యంలో పోలీస్ అవ్వాలనే కోరిక ఉన్న అభ్యర్థులందరూ తమ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు.   ఈ క్రమంలోనే రాచకొండ పోలీసు కమిషనరేట్ అభ్య‌ర్థుల‌కు గుడ్‌న్యూస్ తెలిపింది. పోలీసు ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్టు సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 5 సాయంత్రం 6 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

  Govt Jobs 2022: ఈ వారం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిన ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. అప్లికేష‌న్ ప్రాసెస్‌

  దరఖాస్తుదారులు రాచకొండ పోలీసులు రూపొందించిన క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌చేసి లేదా సమీపంలోని పోలీసుస్టేషన్‌కు నేరుగా వెళ్లి పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్థులు ఎస్సెస్సీ, ఇంటర్‌ మెమోలు, ఆధార్‌కార్డు, నివాస, కుల ధ్రువీకరణ జిరాక్స్‌ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఉచిత శిక్షణ శిబిరాలను మల్కాజిగిరి, కుషాయిగూడ, భువనగిరి, చౌటుప్పల్‌, ఎల్బీనగర్‌, ఇబ్రహీంపట్నంలో నిర్వహించనున్నారు. ఆయా విద్యార్హతలతో పాటు పురుషులు 167.6 సెంటీమీటర్లు, మహిళలు 152.5 సెంటిమీటర్ల ఎత్తు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

  క్యూఆర్ కోడ్‌


  అంతే కాకుండా ఇటీవల హైదరాబాద్ సిటీ పోలీసులు (Hyderabad City Police) గుడ్‌న్యూస్ చెప్పారు. కమ్యూనిటీ ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌ (Community outreach program)లో భాగంగా త్వరలో హైదరాబాద్‌లో ప్రీ-రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ (PRT)ని ప్రారంభించనున్నామని హైదరాబాద్ సిటీ పోలీస్ తాజాగా ప్రకటించింది. పోలీసు శాఖలో సేవలు అందించాలని తపనపడేవారికి ఫ్రీగా సమగ్ర ప్రీ-రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తామని సిటీ పోలీస్ ప్రకటించడంతో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  Telangana Police Jobs: నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఫ్రీగా హైదరాబాద్‌లో ప్రీ-రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్

  ఐదు జోన్లలో ట్రైనింగ్

  హైదరాబాద్ నగరంలోని మొత్తం ఐదు జోన్లలోని వివిధ కేంద్రాల్లో ప్రీ రిక్రూట్‌మెంట్ ట్రైనింగ్ నిర్వహించనున్నామని, తేదీలను త్వరలో ప్రకటిస్తామని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఉచిత PRT కి హాజరు కావడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే బ్యాచ్ టైమింగ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ లింక్ form.jotform.com/220792437998473 పై క్లిక్ చేయాలి.
  Published by:Sharath Chandra
  First published:

  Tags: Jobs in telangana, Telangana, TS Police

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు