తెలంగాణలోని (Telangana) ఎస్సీ యువతకు శుభవార్త. నిరుద్యోగ ఎస్సీ యువతకు ఉచితంగా ఉద్యో, ఉపాధి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ నర్సెస్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ వెల్లడించారు. శనివారం ఆయన ఇందుకు సంబంధించిన కీలక ప్రకటన విడుదల చేశారు. 3 నెలల పాటు ఫార్మసీ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అసిస్టెంట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కోర్సులకు శిక్షణ (Job Training) ఇవ్వనున్నట్లు తెలిపారు. టెన్త్ అర్హత కలిగిన వారు ఇందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 12 నెలల అడ్వాన్స్డ్ డయాలసిస్ టెక్నీషియన్ కోర్సులకు ఇంటర్ అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. నల్లగొండ, మిర్యాలగూడ, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, సూర్యాపేట, జడ్చర్ల, ఖమ్మంలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
శిక్షణ సమయంలో అభ్యర్థులకు ఉచితంగా భోజనం, వసతి సదుపాయం కల్పించనున్నట్లు చెప్పారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 ఏళ్లు ఉండాలని తెలిపారు. పైన సూచించిన అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ నెల 13లోగా దరఖాస్తు చేసుకోవాలని సైదులు సూచించారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9848581100, 9000084085, 7981789044 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో సూచించారు.
TSPSC Group-1: రేపటి నుంచే గ్రూప్-1 హాల్ టికెట్లు.. ఇంకా టీఎస్పీఎస్సీ తీసుకున్న కీలక నిర్ణయాలివే..
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లోని అత్యంత ప్రతిష్టాత్మక హాస్పిటల్స్ లలో నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఒకటన్న విషయం తెలిసిందే. తాజాగా నిమ్స్ ఆస్పత్రి నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల (Jobs) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డేటా ఎంట్రీ ఆపరేటర్, లేబొరేటరీ టెక్నీషయిన్, రిసెర్చ్ అసిస్టెంట్, సైంటిస్ట్ తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో (Job Notification) పేర్కొన్నారు అధికారులు.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 12వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, State Government Jobs, Telangana government jobs, Training