హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Jobs: తెలంగాణ కొలువుల జాతర.. మరో 1271 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే

Telangana Jobs: తెలంగాణ కొలువుల జాతర.. మరో 1271 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో మరో సారి భారీగా ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1271 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు.

తెలంగాణలో కొలువుల జాతర (Telangana Jobs) మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నుంచి 503 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notifications) విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రస్తుతం సాగుతోంది. 17 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాల భర్తీకి సైతం తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ (TSLPRB) విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సైతం ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరులో గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి సైతం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ విద్యుత్ శాఖ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TSSPDCL) నుంచి జాబ్ నోటిఫికేన్ విడుదలైంది. మొత్తం 1271 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), జూనియర్ లైన్ మెన్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంబంధింత విభాగాల్లో ఐటీఐ, బీటెక్, బీఈ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

TSPSC Job Notification: నిరుద్యోగులకు అలర్ట్.. TSPSC నుంచి త్వరలో మరో జాబ్ నోటిఫికేషన్.. ఖాళీలు, విద్యార్హతలివే

విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..

పోస్టుఖాళీలు
అసిస్టెంట్ ఇంజనీర్/ఎలక్ట్రికల్70
సబ్ ఇంజనీర్/ఎలక్ట్రికల్201
జూనియర్ లైన్ మెన్1000
మొత్తం: 1271


ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 11న అంటే బుధవారం విడుదల కానుంది. అదే రోజు నుంచి దరఖాస్తుల ప్రక్రియను సైతం ప్రారంభించనున్నారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు https://tssouthernpower.cgg.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

First published:

Tags: Iti jobs, Job notification, JOBS, Telangana government jobs

ఉత్తమ కథలు