TELANGANA JOBS DECISION IN FILLING JOB VACANCIES CHANGE IN EXAMINATION PROCEDURE EVK
Telangana Jobs: ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీలో కీలక నిర్ణయం.. పరీక్ష విధానంలో మార్పు!
(ప్రతీకాత్మక చిత్రం)
Telangana Jobs | తెలంగాణ ప్రభుత్వం 80,039 ఉద్యోగాలభర్తీలో కీలక అడుగులు వేస్తోంది. పోస్టుల భర్తీ త్వరగా చేసేందుకు అన్ని రకాల కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి ముఖ్యంగా అన్ని సివిల్ ఇంజినీరింగ్ జాబ్స్ భర్తీకి ఒకే పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
కీలకతెలంగాణ ప్రభుత్వం 80,039 ఉద్యోగాలభర్తీలో కీలక అడుగులు వేస్తోంది. పోస్టుల భర్తీ త్వరగా చేసేందుకు అన్ని రకాల కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి ముఖ్యంగా అన్ని సివిల్ ఇంజినీరింగ్ జాబ్స్ భర్తీకి ఒకే పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఎక్కువగా ఉండే నీటిపారుదల, రహదారులు-భవనాలు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదల, ప్రజారోగ్య శాఖల్లో చాలా ఖాళీలు ఉన్నాయి. ఈ శాఖల్లోని పోస్టులకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించడం వల్ల సమయం వృథా అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
అంతేకాకుండా రెండు మూడు విభాగాలకు ఎంపికైన వారి వల్ల పోస్టులు ఖాళీగా మిగిలిపోయే అవకాశం ఉందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని శాఖలకు కలిపి ఒకే పరీక్ష నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం అధికార వర్గాల నుంచి వ్యక్తం అవుతుంది.
సీఎస్ సమీక్ష..
ఇటీవల ఉద్యో గాల భర్తీ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఒకే పరీక్ష అంశంపై సుముఖంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఐదుశాఖల్లో 2,000 ఇంజనీరింగ్ పోస్టులు ఉన్నట్టు గుర్తించారు.
రాష్ట్రంలో నోటిఫికేషన్ విడుదల కాస్త ఆలస్యం అయ్యేలా ఉంది. అందుకు కారణం రోస్టర్ విధానంపై ఇంకా సరైన విధానంపై ఇంకా పూర్తిస్థాయి విధి విధానాలు ఖరారు కాకపోవడం.. అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
తాజాగా ఈ విషయంలపై తెలంగాణ (Telangana) సీఎస్ సోమేష్‌కుమార్ ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమస్య పరిష్కారానికి వీలైనంత తొందరగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఎస్సీ కోటాను 15శాతం వరకు పెంచింది. ఎస్టీ కోటాను 6 శాతం. 29శాతం బీసీ కోటాను నిర్ణయించింది. మిగిలిన 50శాతం ఓసీ కోటాను నిర్ణయించింది. ఈ మేరకు రోస్టర్ విధానాన్ని రూపొందించాల్సి ఉంది.
రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమలుతో ఉద్యోగ కేడర్లలో భారీ మార్పులు జరిగాయి. ఏర్పాటైన సమయంలో పది జిల్లాలు, రెండు జోన్లు ఉండగా.. ఇప్పుడు 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటయ్యాయి. ఇది వరకు జిల్లా స్థాయిలో ఉన్న పోస్టుల్లో కేవలం నాల్గోతరగతి, సబార్డినేట్ పోస్టులు మాత్రమే జిల్లా కేడర్‌లోకి వచ్చాయి. మిగతా పోస్టులు జోనల్ స్థాయిలోకి చేర్చారు. అదేవిధంగా ఇదివరకు జోనల్ స్థాయిలో ఉన్న పోస్టులు మల్టీ జోనల్ (Multi Zonal) కేడర్‌లోకి చేర్చారు. దీంతో ఇదివరకున్న కేడర్‌తో నియామకాలు చేపట్టడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో సమస్యను త్వరగా పరిష్కరించేలా చూడాలని సీఎస్ ఇటీవల అధికారులకు సూచించారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.