తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు (Job Notifications) విడుదలవుతున్నాయి. తాజాగా తెలంగాణలోని నల్లగొండ మెడికల్ కాలేజీలో (Nalgonda Medical College) పలు ఖాళీల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ల విభాగంలో ఖాళీల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను (Job Notification) ఈ నెల 27వ తేదీ 10 గంటల వరకు ప్రిన్సిపల్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. అదే రోజు ఉదయం 11 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభం అవుతాయి. అయితే.. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
మొత్తం 23 ఖాళీలు ఉన్నాయి. ఇందులో అసిస్టెంట్ ప్రొఫెస్ విభాగంలో 15, సివిల్ అసిస్టెంట్ సర్జన్ విభాగంలో 8 ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్:సంబంధిత విభాగంలో MD/MS/DNB విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేయొచ్చు. ఏడాది అనుభవం ఉండాలి. పూర్తి విద్యార్హతల వివరాలు నోటిఫికేషన్ చూడొచ్చు. సివిల్ అసిస్టెంట్ సర్జన్:ఎంబీబీఎస్ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేయాలంటే..
-అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
-అనంతరం అప్లికేషన్ ఫామ్ లో సూచించిన వివరాలను నమోదు చేసి అప్లికేషన్ ఫామ్ ను ప్రిన్సిపల్ కార్యాలయంలో సమర్పించాలి.
-అనంతరం ఈ నెల 27వ తేదీ ఉదయం 11 గంటల నుంచి గ్రీవెన్స్ హాల్, గ్రౌండ్ ఫ్లోర్, -కలెక్టర్ కార్యాలయం, నల్గొండ, తెలంగాణ చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.