మహిళలు, శిశు, దివ్యాంగులు, వియో వృద్ధుల సంక్షేమ శాఖ, సూర్యాపేట జిల్లా (Suryapet District) వారు నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. పలు ఉద్యోగాలను (Telangana Government Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. మొత్తం 3 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు. మిషన్ షక్కి పథకం (సమగ్ర మహిళా సాధికారత కార్యక్రమం) కింద ఈ నియామకాలు చేపట్టినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 29లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు:
S.No. | పోస్టు | ఖాళీలు |
1. | జిల్లా మిషన్ కోఆర్డినేటర్: | 1 |
2. | స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ | 1 |
3. | మల్టీ పర్పస్ స్టాఫ్ | 1 |
విద్యార్హతలు: పోస్టుల ఆధారంగా డిగ్రీ, టెన్ విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వయస్సు జులై 1 నాటికి 25-35 ఏళ్ల వయస్సు ఉండాలి.
GAIL Recruitment 2023: నిరుద్యోగులకు అలర్ట్.. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలో 120 జాబ్స్ .. ఇలా అప్లై చేసుకోండి
అప్లికేషన్: అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులను మహిళలు, శిశు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ, రూమ్ నం.16, కలక్టరేట్, దురాజ్ పల్లి, సూర్యాపేట చిరునామాలో సమర్పించాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Suryapet, Telangana government jobs