హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Teacher Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. గురుకులాల్లో బోధన సిబ్బంది నియామకాలకు ప్రకటన.. ఇలా దరఖాస్తు చేసుకోండి

Telangana Teacher Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. గురుకులాల్లో బోధన సిబ్బంది నియామకాలకు ప్రకటన.. ఇలా దరఖాస్తు చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Teaching Jobs in Telangana: తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. ముఖ్యంగా లెక్చరర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి మహాత్మా జ్యోతిభాఫూలే బీసీ గురుకులాల విద్యాసంస్థల కార్యదర్శి శుభవార్త చెప్పారు. పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన (Job Notification) విడుదల చేశారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Vijayawada

  తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. ముఖ్యంగా లెక్చరర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి మహాత్మా జ్యోతిభాఫూలే బీసీ గురుకులాల విద్యాసంస్థల కార్యదర్శి శుభవార్త చెప్పారు. పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన (Job Notification) విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కొత్తగా ఏర్పాటుచేసిన 15 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో బోధన సిబ్బంది నియామకాలు (Recruitment) చేపడుతున్నట్లు ప్రకటించారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిభాఫూలే బీసీ గురుకులాల విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్య బట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన 15 గురుకుల డిగ్రీ కాలేజీల్లో తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, స్టాటిస్టిక్స్, జియాలజీ, బోటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయో కెమిస్ట్రీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, కామర్స్ అండ్ బిజినెస్ అనలిటిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్, ఎకనామిక్స్, సోషియాలజీ, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మేనేజ్ మెంట్, జియోగ్రఫీ తదితర కోర్సుల్లో బోధించే అనుభవం గల లెక్చరర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు.

  దరఖాస్తు చేసుకున్న వారికి డెమో నిర్వహిస్తామన్నారు. ఎంపిక చేయబడిన లెక్చరర్స్ గంటల ప్రకారం పని చేయాల్సి ఉంటుందని మల్లయ్య బట్టు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆయా జిల్లాల మహాత్మా జ్యోతిభాఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల ఆర్ సి వోలకు తమ దరఖాస్తులు అందించాలని ఆయన సూచించారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 12 ఆఖరి తేదీ అని ఆయన వెల్లడించారు.

  Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగలకు అలర్ట్.. ఆ 10 వేల ఉద్యోగ నోటిఫికేషన్లకు బ్రేక్.. ఎందుకంటే?

  ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లోని అత్యంత ప్రతిష్టాత్మక హాస్పటల్స్ లలో నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఒకటన్న విషయం తెలిసిందే. తాజాగా నిమ్స్ ఆస్పత్రి నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల (Jobs) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డేటా ఎంట్రీ ఆపరేటర్, లేబొరేటరీ టెక్నీషయిన్, రిసెర్చ్ అసిస్టెంట్, సైంటిస్ట్ తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో (Job Notification) పేర్కొన్నారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 12వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: JOBS, State Government Jobs, Teacher jobs, Telangana government jobs

  ఉత్తమ కథలు