Home /News /jobs /

TELANGANA JOBS 2022 TELANGANA STATE LEVEL POLICE RECRUITMENT BOARD RELEASED JOB NOTIFICATION FOR 16614 VACANCIES SS

Breaking News: తొలి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది... 16,614 పోస్టుల భర్తీకి రెడీ

Telangana Jobs: తొలి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది... 16,614 పోస్టుల భర్తీకి రెడీ
(ప్రతీకాత్మక చిత్రం)

Telangana Jobs: తొలి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది... 16,614 పోస్టుల భర్తీకి రెడీ (ప్రతీకాత్మక చిత్రం)

Telangana Jobs | తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ 2022 మే 2న ప్రారంభం కానుంది. ఇందులో కానిస్టేబుల్ పోస్టులు 16,027, ఎస్ఐ పోస్టులు 587 ఉన్నాయి.

    తెలంగాణలోని నిరుద్యోగులు ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాలపై ప్రకటన చేసిన తర్వాత తొలి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వచ్చేసింది. మొత్తం 16,614 పోలీసు ఉద్యోగాల (Police Jobs) భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. పోలీస్ జాబ్ కోసం కొన్ని నెలలుగా ప్రిపేర్ అవుతున్నారు. వారికి ఊరటనిస్తూ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ 2022 మే 2న ప్రారంభం కానుంది. 2022 మే 22 లోగా దరఖాస్తు చేయొచ్చు. ఈ నోటిఫికేషన్‌లో కానిస్టేబుల్ పోస్టులు 16,027, ఎస్ఐ పోస్టులు 587 ఉన్నాయి.

    TSLPRB Recruitment 2022: పోస్టులవారీగా ఖాళీల వివరాలు ఇవే





























































































     మొత్తం ఖాళీలు 16,614
     స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (Civil) 4965
     స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (AR) 4423
    స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (SAR CPL) (Men) 100
     స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (TSSP) (Men) 5010
     కానిస్టేబుల్ ఇన్ తెలంగాణ స్పెషల్ పోలీస్ ఫోర్స్ డిపార్ట్‌మెంట్ 390
     ఫైర్‌మెన్ ఇన్ తెలంగాణ స్పెషల్ పోలీస్ ఫోర్స్ డిపార్ట్‌మెంట్ 610
     వార్డర్స్ (Male) ఇన్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ 136
     వార్డర్స్ (Female) ఇన్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ 10
     స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (Civil) 414
     స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (AR) 66
     స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (SAR CPL) (Men) 05
     స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (TSSP) (Men) 23
     సబ్ ఇన్‌స్పెక్టర్ (Men) ఇన్ తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్‌మెంట్ 12
     స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్26
     డిప్యూటీ జైలర్ ఇన్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ 8
     స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (Information Technology & Communications Organization) 262
     స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (Mechanics) (Men) 21
     స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) పోలీస్ కానిస్టేబుల్ (Drivers) (Men) 100
     స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (Information Technology & Communications Organization) 22
     స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (Police Transport Organization) 03
     స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ (SCT) అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 8

    మొత్తం 16,614 పోస్టుల భర్తీకి నాలుగు వేర్వేరు నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. పోలీస్ కానిస్టేబుల్ సివిల్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఎస్సై సివిల్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. పోలీస్ కానిస్టేబుల్ ఐటీ, మెకానిక్ తదితర పోస్టులకు ఇక్కడ క్లిక్ చేయండి. ఎస్ఐ ఐటీ, పీటీఓ తదితర పోస్టులకు ఇక్కడ క్లిక్ చేయండి. పూర్తి వివరాలు https://www.tslprb.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Govt Jobs 2022, JOBS, State Government Jobs, Telangana government jobs, Telangana jobs, Telangana police jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు