Telangana Jobs 2021: తెలంగాణలో 172 జూనియర్ పంచాయతీ సెక్రెటరీ ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Telangana Jobs 2021: తెలంగాణలో 172 జూనియర్ పంచాయతీ సెక్రెటరీ ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)

Telangana JPS Recruitment 2021 | తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ జూనియర్ పంచాయతీ సెక్రెటరీ (Junior Panchayat Secretary) పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి మరో 2 రోజులే గడువుంది. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.

  • Share this:
    తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. పంచాయతీరాజ్ శాఖ పలు ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. స్పోర్ట్స్ కోటాలో జూనియర్ పంచాయతీ సెక్రెటరీ (Junior Panchayat Secretary) పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 172 ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు 2021 సెప్టెంబర్ 18న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2021 అక్టోబర్ 10 చివరి తేదీ. ఇవి స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న పోస్టులు కాబట్టి విద్యార్హతలతో పాటు పలు క్రీడల్లో రాణించి ఉండాలి. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

    Telangana JPS Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...





























































































































     మొత్తం ఖాళీలు  172
     ఆదిలాబాద్  6
     భద్రాద్రి కొత్తగూడెం  7
     జగిత్యాల  5
     జనగాం  4
     జయశంకర్ భూపాలపల్లి, ములుగు  6
     జోగుళాంబ గద్వాల  3
     కామారెడ్డి  8
     కరీంనగర్  4
     ఖమ్మం  9
     కొమరంభీమ్ ఆసిఫాబాద్  4
     మహబూబాబాద్  7
     మహబూబ్‌నగర్, నారాయణపేట  10
     మంచిర్యాల  4
     మెదక్  6
     నాగర్‌కర్నూల్  6
     నల్గొండ  13
     నిర్మల్  6
     నిజామాబాద్  8
     పెద్దపల్లి  3
     రాజన్న సిరిసిల్ల  3
     రంగారెడ్డి  7
     సంగారెడ్డి  8
     సిద్దిపేట  6
     సూర్యపేట  6
     వికారాబాద్  8
     వనపర్తి  3
     వరంగల్ రూరల్  5
     వరంగల్ అర్బన్  1
     యాదాద్రి భువనగిరి  6

    Oil India Recruitment 2021: ఆయిల్ ఇండియాలో 35 ఉద్యోగాలు.. రూ.2,20,000 వరకు వేతనం

    Telangana JPS Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    భర్తీ చేసే పోస్టులు- జూనియర్ పంచాయతీ సెక్రెటరీ

    ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2021 సెప్టెంబర్ 18

    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 అక్టోబర్ 10

    విద్యార్హతలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి.

    క్రీడార్హతలు- హాకీ, వాలీబాల్, హ్యాండ్‌బాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ లాంటి క్రీడల్లో రాణించాలి.

    వయస్సు- 18 నుంచి 44 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

    దరఖాస్తు ఫీజు- జనరల్, బీసీ క్రీమీలేయర్ కేటగిరీ అభ్యర్థులకు రూ.800. ఎస్సీ, ఎస్టీ, బీసీ నాన్ క్రీమీలేయర్ అభ్యర్థులకు రూ.400.

    పరీక్షా కేంద్రాలు- హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్.

    ఎంపిక విధానం- రాతపరీక్ష.
    వేతనం- రూ.28,719.

    ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Tech Mahindra Jobs: టెక్ మహీంద్రాలో 100 ఉద్యోగాలు... డిగ్రీ పాస్ అయితే చాలు

    Telangana JPS Recruitment 2021: అప్లై చేయండి ఇలా


    Step 1- అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ వివరాలు  http://www.tsprrecruitment.in/వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

    Step 2- ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి http://www.tsprrecruitment.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

    Step 3- అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి.

    Step 4- విద్యార్హతలు, క్రీడార్హతల వివరాలు ఎంటర్ చేయాలి.

    Step 5- ఫోటో, సంతకం, డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.

    Step 6- దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

    Step 7- అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published: