హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Jobs: తెలంగాణలో 1466 జాబ్స్... రేపే లాస్ట్ డేట్

Telangana Jobs: తెలంగాణలో 1466 జాబ్స్... రేపే లాస్ట్ డేట్

Telangana Jobs: తెలంగాణలో 1466 జాబ్స్... రేపే లాస్ట్ డేట్
(ప్రతీకాత్మక చిత్రం)

Telangana Jobs: తెలంగాణలో 1466 జాబ్స్... రేపే లాస్ట్ డేట్ (ప్రతీకాత్మక చిత్రం)

Telangana Jobs 2020 | నేషనల్ రూరల్ రిక్రియేషన్ మిషన్ సొసైటీ-NRRMS తెలంగాణలో 1466 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

  తెలంగాణలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది నేషనల్ రూరల్ రిక్రియేషన్ మిషన్ సొసైటీ-NRRMS. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్-DDU-RID ప్రాజెక్ట్‌లో భాగంగా మొత్తం 1466 ఖాళీలను భర్తీ చేస్తోంది. టెక్నికల్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, అకౌంట్స్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, మల్టీ టాస్కింగ్ అఫీషియల్, డేటా మేనేజర్ లాంటి పోస్టులున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా 1502 ఖాళీలను భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://nrrmsvacancy.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు https://www.nrrmsvacancy.com/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

  NRRMS Telangana Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


  మొత్తం ఖాళీలు- 1466

  కంప్యూటర్ ఆపరేటర్- 312

  టెక్నికల్ అసిస్టెంట్- 33

  డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్- 16

  అకౌంట్స్ ఆఫీసర్- 19

  డేటా మేనేజర్- 48

  ఎంఐఎస్ మేనేజర్- 62

  ఎంఐఎస్ అసిస్టెంట్- 214

  మల్టీ టాస్కింగ్ అఫీషియల్- 228

  ఫీల్డ్ కోఆర్డినేటర్- 278

  ఫెసిలిటేటర్స్- 256

  NRRMS Telangana Recruitment 2020, Telangana Jobs, NRRMS jobs in Telangana, National Rural Recreation Mission Society jobs, Telangana news, తెలంగాణ వార్తలు, తెలంగాణ ఉద్యోగాలు, నేషనల్ రూరల్ రిక్రియేషన్ మిషన్ సొసైటీ ఉద్యోగాలు, తెలంగాణ జాబ్ నోటిఫికేషన్, తెలంగాణ న్యూస్
  ప్రతీకాత్మక చిత్రం

  NRRMS Telangana Recruitment 2020: వేతనాల వివరాలివే...


  కంప్యూటర్ ఆపరేటర్- రూ.16700

  టెక్నికల్ అసిస్టెంట్- రూ.19650

  డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్- రూ.26560

  అకౌంట్స్ ఆఫీసర్- రూ.22650

  డేటా మేనేజర్- రూ.17630

  ఎంఐఎస్ మేనేజర్- రూ.17660

  ఎంఐఎస్ అసిస్టెంట్- రూ.17030

  మల్టీ టాస్కింగ్ అఫీషియల్- రూ.16300

  ఫీల్డ్ కోఆర్డినేటర్- రూ.16660

  ఫెసిలిటేటర్స్- రూ.16660

  NRRMS Telangana Recruitment 2020, Telangana Jobs, NRRMS jobs in Telangana, National Rural Recreation Mission Society jobs, Telangana news, తెలంగాణ వార్తలు, తెలంగాణ ఉద్యోగాలు, నేషనల్ రూరల్ రిక్రియేషన్ మిషన్ సొసైటీ ఉద్యోగాలు, తెలంగాణ జాబ్ నోటిఫికేషన్, తెలంగాణ న్యూస్
  ప్రతీకాత్మక చిత్రం

  NRRMS Telangana Recruitment 2020: విద్యార్హతలు ఇవే...


  కంప్యూటర్ ఆపరేటర్- ఇంటర్‌తో పాటు కనీరం 6 నెలల డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ అప్లికేషన్స్ సర్టిఫికెట్ ఉండాలి.

  టెక్నికల్ అసిస్టెంట్- డిగ్రీ లేదా 6 నెలల డీసీఏ, కంప్యూటర్ టైపింగ్‌, డేటా ఎంట్రీ, రిపోర్ట్ జనరేషన్‌లో నైపుణ్యం, ఎంఎస్ ఆఫీస్‌లో ఏడాదికి పైగా అనుభవం ఉండాలి. (బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ-IT, బీఎస్సీ-IT, బీసీఏ, పీజీడీసీఏ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది)

  డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్- సోషల్, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ సెక్టార్‌లో ఏడాది అనుభవంతో పీజీ, మూడేళ్ల అనుభవంతో డిగ్రీ ఉండాలి.

  అకౌంట్స్ ఆఫీసర్- ఫైనాన్స్, అకౌంట్స్ సంబంధిత అంశాల్లో 2 ఏళ్ల అనుభవంతో డిగ్రీ లేదా పీజీ ఉండాలి.

  డేటా మేనేజర్- డిగ్రీతోపాటు కంప్యూటర్ టైపింగ్‌, డేటా ఎంట్రీ, రిపోర్ట్ జనరేషన్‌లో నైపుణ్యం, ఎంఎస్ ఆఫీస్‌లో ఏడాదికి పైగా అనుభవం ఉండాలి. (బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ-IT, బీఎస్సీ-IT, బీసీఏ, పీజీడీసీఏ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది)

  ఎంఐఎస్ మేనేజర్- రిపోర్ట్ జనరేషన్‌లో 2 ఏళ్లకు పైగా అనుభవంతో డిగ్రీ, 4 ఏళ్లకు పైగా అనుభవంతో డిప్లొమా ఉండాలి. (బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ-IT, బీఎస్సీ-IT, బీసీఏ, పీజీడీసీఏ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది)

  ఎంఐఎస్ అసిస్టెంట్- కంప్యూటర్ అప్లికేషన్స్‌లో 2 ఏళ్లకు పైగా అనుభవంతో డిప్లొమా లేదా డిగ్రీ. (బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ-IT, బీఎస్సీ-IT, బీసీఏ, పీజీడీసీఏ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది)

  మల్టీ టాస్కింగ్ అఫీషియల్- కంప్యూటర్ అప్లికేషన్స్‌లో 2 ఏళ్లకు పైగా అనుభవంతో 10+2 లేదా డిగ్రీ ఉండాలి.

  ఫీల్డ్ కోఆర్డినేటర్- కంప్యూటర్ అప్లికేషన్స్‌లో అనుభవంతో పాటు 10+2 ఉండాలి.

  ఫెసిలిటేటర్స్- కంప్యూటర్ అప్లికేషన్స్‌లో ఏడాదికి పైగా అనుభవంతో 10+2 పాస్ కావాలి.

  NRRMS Telangana Recruitment 2020, Telangana Jobs, NRRMS jobs in Telangana, National Rural Recreation Mission Society jobs, Telangana news, తెలంగాణ వార్తలు, తెలంగాణ ఉద్యోగాలు, నేషనల్ రూరల్ రిక్రియేషన్ మిషన్ సొసైటీ ఉద్యోగాలు, తెలంగాణ జాబ్ నోటిఫికేషన్, తెలంగాణ న్యూస్
  ప్రతీకాత్మక చిత్రం

  NRRMS Telangana Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


  నోటిఫికేషన్ విడుదల- 2020 ఫిబ్రవరి 10

  దరఖాస్తు ప్రారంభం- 2020 ఫిబ్రవరి 13

  దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 5

  వయస్సు- 18 నుంచి 43 ఏళ్లు. (పోస్టును బట్టి వయస్సు మారుతుంది)

  ఫీజు- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.250. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.150.

  నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

  Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  ఇవి కూడా చదవండి:

  Railway Jobs: భారతీయ రైల్వేలో 2792 ఉద్యోగాలు... పోస్టుల వివరాలివే

  Axis Bank Jobs: ఈ కోర్సు పాసైతే యాక్సిస్ బ్యాంకులో జాబ్ గ్యారెంటీ

  AIIMS Recruitment 2020: ఎయిమ్స్‌లో 418 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: CAREER, Exams, Job notification, JOBS, NOTIFICATION, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu

  ఉత్తమ కథలు