తెలంగాణ (Telangana) బీబీనగర్ లోని ఆల్ ఇండియా ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా సంస్థ నుంచి నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. నాన్ అకాడమిక్ విభాగంలో సీనియర్ రెసిడెంట్లు, జూనియర్ రెసిడెంట్ల పోస్టుల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 11లోగా ఈ మెయిల్ (ace.aiimsbbnagar@gmail.com) ద్వారా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు (Interviews) నిర్వహించి ఎంపిక చేస్తారు. అప్లికేషన్ ఫామ్ (Job Application) ను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
సీనియర్ రెసిడెంట్లు..
సీనియర్ రెసిడెంట్ల విభాగంలో మొత్తం 38 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందులో జనరల్ మెడిసిన్&అనస్తేషియా, పీడియాట్రిక్స్&CFM , బయోకెమిస్ట్రీ అండ్ మైక్రోబయోలజీ, ఆర్థోపెడిక్స్, ఫార్మకాలజీ అండ్ రేడియాలజీ, ట్రాన్స్ఫూజన్ మెడిసిన్ అండ్ బ్లడ్ బ్యాంక్ అండ్ హాస్పటల్ అడ్మినిస్ట్రేషన్, OBGY & ENT తదితర డిపార్టుమెంట్లలో ఖాళీలు ఉన్నాయి. MD/ MS/ DM/ M.Ch/ DNB విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
DRDO Recruitment 2021: డీఆర్‌డీఓలో 106 ఉద్యోగాలు... ఆ అర్హతలు ఉంటే చాలు
ఈ ఖాళీలకు నవంబర్ 22 నుంచి 30వ తేదీ వరకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. అభ్యర్థులు రూ. 1500లను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, EWS అభ్యర్థులకు ఫీజులో రూ. 300 రాయితీ ఇచ్చారు. వారు రూ. 1200 చెల్లిస్తే సరిపోతుంది. మహిళలు, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఇచ్చారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫామ్ ను అభ్యర్థులు ఈ లింక్ ద్వారా నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
IOCL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. IOCLలో 1968 ఖాళీలు.. ఇలా అప్లై చేసుకోండి
జూనియర్ రెసిడెంట్లు..
జూనియర్ రెసిడెంట్స్ విభాగంలో మొత్తం 25 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ విద్యార్హతతో పాటు ఇంటర్న్షిప్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా/ స్టేట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అభ్యర్థుల వయస్సు 37 ఏళ్లలోపు ఉండాలి. దరఖాస్తులు ఖాళీల కన్నా మూడు రెట్లు ఎక్కువగా వస్తే ఇంటర్వ్యూలను నిర్వహించి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫామ్ ను అభ్యర్థులు ఈ లింక్ ద్వారా నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aiims, Government jobs, Job notification, JOBS, Telangana government jobs