హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana: రూ.7.57 లక్షల కోట్ల పెట్టుబడులు.. 3.14 లక్షల మందికి ఉపాధి.. సీఎస్ సోమేశ్ కుమార్

Telangana: రూ.7.57 లక్షల కోట్ల పెట్టుబడులు.. 3.14 లక్షల మందికి ఉపాధి.. సీఎస్ సోమేశ్ కుమార్

మాట్లాడుతున్న సీఎస్ సోమేశ్ కుమార్

మాట్లాడుతున్న సీఎస్ సోమేశ్ కుమార్

పారిశ్రామిక, ఐ.టి. రంగాలలో రాష్ట్ర స్థూల అభివృద్ధి ఉత్పత్తి (జిఎస్‌డిపి) పెంపుదల వ్యూహాలను రూపొందించడంపై  బి.ఆర్‌.కె.ఆర్ భవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

పారిశ్రామిక, ఐ.టి. రంగాలలో రాష్ట్ర స్థూల అభివృద్ధి ఉత్పత్తి (జిఎస్‌డిపి) పెంపుదల వ్యూహాలను రూపొందించడంపై  బి.ఆర్‌.కె.ఆర్ భవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ (CS Somesh Kumar) మాట్లాడుతూ..  ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు (CM KCR) దార్శనిక నాయకత్వంలో పర్యావరణ నియంత్రణ, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, విధానపరమైన మద్దతు, క్రియాశీలత వల్ల రాష్ట్రం రూ.7.57 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తోందని, గత ఎనిమిదేళ్లలో 3.14 లక్షల మందికి అదనపు ఉపాధిని (Jobs) కల్పించడం జరిగిందన్నారు. జిఎస్‌డీపీని మెరుగుపరిచేందుకు, ప్రైవేటు రంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు, మరిన్ని ఉద్యోగాలు కల్పించేందుకు వీలుగా చేపట్టాల్సిన చర్యలను సూచించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను కోరారు.

జీవన ప్రమాణాలలో రాష్ట్ర ర్యాకింగ్ పెంచడం కోసం శాఖలు తీసుకోగల యాక్షన్ పాయింట్‌లను అధికారులు గుర్తించి రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ లో విధాన మార్పులను సూచించాలని ఆయన కోరారు. ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ టెక్స్ టైల్స్, ఎలక్ట్రానిక్స్, ఐటి అండ్ ఐటీఈఎస్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఆటోమొబైల్, లైఫ్ సైన్సెస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్‌ఎంఈ, మైనింగ్ మరియు లాజిస్టిక్స్ రంగాలలో ప్రైవేట్ పెట్టుబడులు, ఉద్యోగాలను సృష్టించడానికి అధిక సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయన్నారు.

Telangana Investments: తెలంగాణలో ప్రముఖ జాకీ సంస్థ పెట్టుబడులు.. 7 వేల మందికి ఉద్యోగాలు .. ఆ జిల్లాల్లో ఏర్పాటు

అదేవిధంగా ఫర్నిచర్, బొమ్మల తయారీ, డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, గ్రీన్ హైడ్రోజన్‌లు తదితర రంగాలను ప్రభుత్వం ప్రాధాన్యతా రంగాలుగా దృష్టి సారిస్తోందని అన్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రజత్ కుమార్, అరవింద్ కుమార్, సునీల్ శర్మ, రాణి కుముదిని, అధర్ సిన్హా, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

First published:

Tags: Cs somesh kumar, Investments, JOBS, Telangana

ఉత్తమ కథలు