Raliway Jobs: ఆర్ఆర్బీ పరీక్ష రాస్తున్నారా? చదవాల్సిన పుస్తకాలు ఇవే...
ఇంటర్ విద్యార్థులకు శుభవార్త. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువును మరో రెండు రోజులు పెంచింది తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి. గతంలో ఇంటర్ బోర్డు 02-05-2019 వరకు గడువు విధించింది. అయితే ఇప్పటికీ కొందరు విద్యార్థులు ఫీజులు చెల్లించకపోవడం, తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తులు రావడంతో రెండు రోజులు గడువు పెంచారు అధికారులు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష రాయాలనుకునే విద్యార్థులు 04-05-19 లోగా సప్లిమెంటరీ ఫీజు చెల్లించాలి. కళాశాల ప్రిన్సిపాల్స్ కూడా ఆన్లైన్లో బోర్డుకు 04-05-19 తేదీ లోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Read this:
ఇంటర్ పాసయ్యారా? తర్వాత చేయాల్సిన కోర్సులివే...ఇక ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను గతంలోనే విడుదల చేసింది ఇంటర్ బోర్డు. మే 25 నుంచి జూన్ 4 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు, జూన్ 7 నుంచి 10 వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి షెడ్యూల్ ప్రకటించింది. అయితే మే 26, 27 తేదీల్లో BIT SAT / JEE పోటీ పరీక్షలున్నాయి. దీంతో విద్యార్థులు పరీక్షలు రాయడంలో సమస్యలొస్తున్నాయి. ఇదే విషయాన్ని ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రులు బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. అయితే విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా పరీక్షల తేదీలను మారుస్తామని, సమీక్షించి త్వరలో కొత్త తేదీలు ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు తెలిపింది.
Photos: బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్‌లో మెరిసిన అందాల తారలు
ఇవి కూడా చదవండి:
Inter: ఇంటర్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు... ఇలా చేయాలిAlert: ఈ 12 రకాల ఫేక్ ఇమెయిల్స్ అస్సలు ఓపెన్ చేయొద్దు
LIC Policy: మీ జీతం తక్కువా? ఈ ఎల్ఐసీ పాలసీ మీ కోసమే...
First published:
May 2, 2019, 6:04 PM IST