HOME »NEWS »JOBS & EDUCATION »telangana intermediate results 2020 inter 1st year and 2nd year results releasing today know how to check ss

TS Inter Results 2020: తెలంగాణ ఇంటర్ ఫలితాలు... చెక్ చేయాల్సిన వెబ్‌సైట్స్ ఇవే

TS Inter Results 2020: తెలంగాణ ఇంటర్ ఫలితాలు... చెక్ చేయాల్సిన వెబ్‌సైట్స్ ఇవే
TS Inter Results 2020: (ప్రతీకాత్మక చిత్రం)

TS Inter Results 2020 Updates | తెలంగాణలో సుమారు 10 లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఏ వెబ్‌సైట్లలో చెక్ చేయాలో తెలుసుకోండి.

  • Share this:
    తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియర్ రిజల్ట్స్ వచ్చేశాయి. తెలంగాణలో ఇంటర్ ఫలితాలపై ఇన్నాళ్లూ ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి గురువారం ఫలితాలను విడుదల చేసేందుకు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్-TSBIE సిద్ధమైంది. మధ్యాహ్నం 3 గంటలకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్, వొకేషనల్ ఫలితాలు విడుదల చేస్తున్నట్టు ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. గతేడాది ఇంటర్ ఫలితాల విషయంలో గందరగోళం తలెత్తిన సంగతి తెలిసిందే. అందుకే ఒకటికి రెండుసార్లు అన్నీ సరిచూసుకొని ఫలితాలను విడుదల చేస్తున్నారు అధికారులు. తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ https://tsbie.cgg.gov.in/ తో పాటు http://results.cgg.gov.in, http://examresults.ts.nic.in వెబ్‌సైట్లలో ఫలితాలు విడుదలవుతాయి. వీటితో పాటు https://telugu.news18.com/ వెబ్‌సైట్‌లో కూడా ఇంటర్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అయితే తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలైన వెంటనే సమాచారం తెలుసుకోవాలంటే https://telugu.news18.com/ వెబ్‌సైట్‌లో విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ కింద ఇచ్చిన రిజిస్ట్రేషన్ విండోలో విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ లేదా సెకండ్ ఇయర్ సెలెక్ట్ చేసి, పూర్తి పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ అడ్రస్ వెల్లడించి రిజిస్టర్ చేసుకోవాలి. తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాలను విడుదల చేసిన వెంటనే విద్యార్థులకు సమాచారం అందుతుంది. రిజల్ట్స్ వచ్చిన వెంటనే విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.

    తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో ఇంటర్ ఫలితాలను తెలుసుకునేందుకు ఈ స్టెప్స్ ఫాలో అవండి.



    ముందుగా https://tsbie.cgg.gov.in/ ఓపెన్ చేయండి.
    హోమ్ పేజీలో ఇంటర్ ఫలితాలకు సంబంధించిన లింక్ పైన క్లిక్ చేయండి.
    ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్‌కు వేర్వేరు లింక్స్ ఉంటాయి.
    లింక్ క్లిక్ చేసిన తర్వాత హాల్ టికెట్ నెంబర్, ఇతర వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.
    ఫలితాల కాపీని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసి భద్రపర్చుకోవాలి.

    రాష్ట్ర వ్యాప్తంగా 9.65 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా గతంలో లాగా ప్రెస్ మీట్‌లో ఫలితాలు విడుదల చేసే అవకాశం లేదు. ఆన్‌లైన్‌లోనే నేరుగా ఫలితాలను విడుదల చేయనుంది తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్.

    Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    TS Inter Results 2020: మొబైల్ యాప్‌లో ఇంటర్ ఫలితాలు... ఇలా చెక్ చేయండి

    Career Guidance: ఇంటర్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు... చేయొచ్చు ఇలా

    Courses After Inter: ఇంటర్ తర్వాత ఈ కోర్సులు చేయొచ్చు

    Courses after Inter: ఇంటర్ తర్వాత ఈ 123 కోర్సులు చేయొచ్చు... విద్యార్థులకు సీబీఎస్ఈ సలహా
    Published by:Santhosh Kumar S
    First published:June 18, 2020, 08:54 IST