తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళంపై ఇంటర్ బోర్డు వివరణ ఇచ్చింది. మెమోల్లో వచ్చిన తప్పులపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని సూచించారు. తాము పరీక్షకు హాజరైనా మార్కలుు ఇవ్వకుండా ఇంటర్ ధ్రువపత్రాల్లో ఏఎఫ్, ఏపీ అని రావడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షకు హాజరుకాకపోతే ఆబ్సెంట్(ఏబీ) అని ఉండాలి. అలా కాకుండా ఏఎఫ్, ఏపీ అని ఉండడంతో వాటి అర్థం తెలియక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.
విద్యార్థులు పరీక్షలకు హాజరైనప్పటికి పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ బ్లాంక్ బార్ కోడ్ వివరాలను బోర్డుకు సమర్పించకపోవడంతో మెమోల్లో ముగ్గురు విద్యార్థులకు సంబంధించిన మార్కులు మెమోలో నమోదు కాలేదని తెలిపారు. దీనిపై ఇప్పటికే విచారణ చేపట్టామని, ఆవివరాలను పరీక్ష కేంద్రం నుంచి సేకరించి విద్యార్థుల మార్కులను మెమోలో పొందుపరిచి కాలేజీలకు పంపిస్తామని అధికారులు తెలిపారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ, వాల్యూయేషన్, రిజల్ట్స్ అనౌన్స్మెంట్స్ విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు పడ్డామని, ఈ విషయంలో స్టూడెంట్స్, పేరెంట్స్ ఆందోళన పడొద్దని.. ఎవరికైనా సందేహాలుంటే 040-24600110 నెంబర్కి కాల్ చేయొచ్చని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
TS Inter Supplementary Exams : ఇంటర్ సప్లిమెంటరీ టైమ్ టేబుల్ ఇదే..