ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు

Inter supplementary exams | ఇప్పటికే ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫీజు గడువును మరోసారి పొడిగించారు అధికారులు. గతంలో 27 వరకు ఉన్న గడవు.. 29వరకు పొడిగించగా.. తాజాగా మే 2వరకు పొడిగిస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది.

news18-telugu
Updated: April 29, 2019, 4:11 PM IST
ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు గడువుని మరోసారి పొడిగించింది ఇంటర్ బోర్డు. ఫీజు చెల్లింపునకు మే 2 వరకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో ఏప్రిల్ 27 వరకే గడువు ఉండగా.. ఏప్రిల్ 29కి పొడిగించారు. తాజాగా ఈ గడువుని కూడా మే 2 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఇంటర్ ఫలితాలపై గందరగోళం కొనసాగుతున్న నేపథ్యంలోనే బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి.

తాజాగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను మే 16 నుంచి మే 25కి వాయిదా వేశారు అధికారులు. మే 25 నుంచి జూన్ 4 వరకూ పరీక్షలు నిర్వహిస్తామని.. అదే విధంగా జూన్ 7 నుంచి 10వ తేదీ వరకూ ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరుగుతాయని ఇంటర్ బోర్డు వెల్లడించింది.

ప్రస్తుతం ఫెయిలైన విద్యార్థుల రీవెరిఫికేషన్ జరుగుతోంది. ఈ రిజల్ట్స్ రావడానికి కనీసం 10 రోజుల టైమ్ పడుతుంది.

First published: April 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>