Home /News /jobs /

TELANGANA INTER SPECIAL DOWNLOAD INTER SECONDARY SANSKRIT MODEL PAPER KNR EVK

TS Inter 2nd Year Sanskrit Model paper: తెలంగాణ ఇంట‌ర్ ప్ర‌త్యేకం.. సెకండియ‌ర్ సంస్కృతం మోడ‌ల్ పేప‌ర్ డౌన్‌లోడ్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TS Inter 2nd Year Sanskrit Model paper | గత రెండు సంవత్సరాలుగా కరోనా నేపథ్యంలో విద్యార్థులకు , ఆన్లైన్ క్లాసులు ఎక్కువగా నడిచాయి.. గత కొద్ది రోజులుగా కోవిద్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో.. ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ సంస్కృతం మోడల్ పేపర్ లో ఇంటర్మీడియట్ బోర్డు 70 శాతం సిలబస్ ఇస్తున్నారు.

ఇంకా చదవండి ...
    సేక‌ర‌ణ - శ్రీనివాస్. పి, న్యూస్ 18 తెలుగు, క‌రీంన‌గ‌ర్‌

    గత రెండు సంవత్సరాలుగా కరోనా నేపథ్యంలో విద్యార్థులకు , ఆన్లైన్ క్లాసులు ఎక్కువగా నడిచాయి.. గత కొద్ది రోజులుగా కోవిద్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో.. ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ సంస్కృతం మోడల్ పేపర్ లో ఇంటర్మీడియట్ బోర్డు  70 శాతం సిలబస్ నివ్వడం మాత్రమే జరిగింది. అయితే విద్యార్థులకు ఎలా ప్రిపరేషన్ అవుతే ఎంత స్కోర్ చేయాలని క్రింద మోడల్ పేపర్ లో ఇవ్వడం జరిగినది.
    అన్ని పేపర్లు అలాగే ఈ పేపర్ కూడా మూడు సెక్షన్స్ ఇవ్వడం జరిగింది అవి ఏ, బి, సి..

    ద్వితీయ సంవత్సరం  భాష సంస్కృత ప్రశ్న పత్రంలో నూతనంగా చేసిన మాదిరి ప్రశ్నాపత్రంలో మొదటి బిట్ నందు మూడు శ్లోకాలు ఇచ్చి ఏదేని ఒక శ్లోకానికి ప్రతిపదార్థ్యం రాయమందురు . దీనికి 1 × 6 = 6 మార్కులు కేటాయించ బడినవి .
    రెండవ బిట్ ( II ) నందు 3 వ్యాస - ఇంటర్ బోర్డు రూప సమాధాన ప్రశ్నలు ఇచ్చి ఏదేని ఒక ప్రశ్నకు సమాధానం రాయమందురు . దీనికి 1x6 = 6 మార్కులు కేటాయించబడినవి .
    2 వ  బిట్టు లో గద్యభాగం ప్రశ్నలు ఇచ్చి ఏదేని నుండి 3 వ్యాసరూప ఒక ప్రశ్నకు సమాధానం మార్కులు  రాయమాందురు . దీనికి 1x6 = 6
    4 వ బిట్టు ఉప వాచకం నుండి 4 ప్రశ్నలు ఇచ్చి ఏదేని రెండు . ప్రశ్నలకు సమాధానాలు రాయమందురు . ఒక ప్రశ్నకు 4 మార్కులు అనగా ఈ బిట్టుకు 2X4 = 8 మార్కులు కేటాయించబడినవి .
    ప్రశ్న పత్రంలోని 5వ వ బిట్ నందు ఆ పత్రలేఖనానికి గాను 3 ప్రశ్నలలో ఏదేని ఒక సమాధానం రాయాలి . దీనికి 1x5 = 5 మార్కులు కేటాయించబడినవి .

    ప్రశ్న పత్రంలోని 12, 13 బిట్లు సంధులకు సంబంధించినది .  బిట్టులో 12 వ బిట్టు లో ఇచ్చి వాటిలో , ఏవేని నాలుగు పదాలు విడదీసి సంధిపేరు రాయాల్సి ఉంటుంది . దీనికి గాను 2x4=8 మార్కులు కేటాయించ బడినవి . 13వ బిట్ నందు 12 పదాలువిడదీసి ఇచ్చి వాటిలో నాలుగు పదాలు కలిపి రాసి ,  సంధిపేరు రాయమందురు .దీనికి గాను 2X4 = 8 మార్కులు కేటాయించబడినవి .

    ప్రశ్నపత్రంలోని 14వ బిట్ నందు ఐదు అశుద్ధమైన వాక్యాలు ఇచ్చి వాటిని  సరిచేసి రాయమందురు . దీనికి గాను 5 మార్కులు కేటాయించబడినవి .
    మొదటి బిట్ కొరకు పద్యభాగంలోని 3,4 పాఠాలలో ఏదేని ఒక పాఠంలోని నాలుగు శ్లోకాలకు ప్రతిపదార్థం నేర్చుకొన్నచో 6 మార్కులు , రెండవ బిట్ కొరకు పద్యభాగం లోని 2,6 పాఠాలలో ఏదేని ఒక పాఠంలోని వ్యాసరూప సమాధాన ప్రశ్న నేర్చుకున్నటైతే 6 మార్కులు , మూడవ బిట్ కొరకు గద్యభాగంలో 2'5 ఏదేని ఒక పాఠం నేర్చుకున్న ట్లైతే 6మార్కులు వస్తాయి.

    నాల్గవ బిట్ కొరకు ఉపవాచకంలోని  1,3 పాఠాలలో  ఏదేని ఒక ప్రశ్న చదివినట్లయితే 8 మార్కులు , , పదకొండవ బిట్  కొరకు పాఠ్యపుస్తకం లోని మూడు పత్రాలలో ఏదేని ఒక పత్రం నేర్చుకున్నట్లైతే 5 మార్కులు ,12మరియు 13 కొరకు పాఠ్యపుస్తకంలో ఇచ్చిన  ఐదు సంధులలో ఏవేని నాలుగు సంధులు నేర్చు 16 మార్కులు , 14 వ బిట్ కొరకు పాఠ్య పుస్తకంలోని 15 వాక్యాలు నేర్చుకున్నట్లైతే 5 మార్కులు సులభంగా సాధించవచ్చు .



    అయితే విద్యార్థులుఎక్కువగా పద్యభాగం లో విక్రమన్కస్య ఔదార్యo, గద్యభాగం లో గాత్ర వాత్సల్యం, అలాగే సాధు వర్ధనం అనే టాపిక్ ఎక్కువ చదువుతే ఎక్కవ మార్కులు సాధించగలరని  తెలిపారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Career and Courses, Intermediate exams, Telangana, Telangana intermediate board exams

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు