• Home
  • »
  • News
  • »
  • jobs
  • »
  • TELANGANA INTER SECOND YEAR EXAMS MAY CANCEL DUE TO CORONA HERE FULL DETAILS NS

Telangana Inter Exams: తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు కూడా రద్దు..? మార్కుల కేటాయింపు ఇలా?

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను కూడా రద్దు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా విజృంభిస్తుండడంతో పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    తెలంగాణలో ఇటీవల ఇంటర్ ఫస్ట్ ఇయర్ తో పాటు, టెన్త్ పరీక్షలను ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసిన విషయం తెలిసిందే.  అయితే.. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలపై జూన్ మొదటి వారంలో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని సర్కార్ ఆ సమయంలో తెలిపింది. అయితే కరోనా విజృంభణ అప్పటి వరకు కూడా తగ్గే పరిస్థితి కనిపించడం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ ఇక కష్టమేనని వారు భావిస్తున్నారు. ఒక వేళ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితులు ఏర్పడితే వారికి మార్కులు ఎలా కేటాయించాలన్న అంశంపై కసరత్తును ఇంటర్ బోర్డు అధికారులు ప్రారంభించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఆయా విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగానే సెకండియర్ మార్కులను ఇవ్వడమే బెటర్ అని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఎవరైనా విద్యార్థులు ఆ మార్కులు తమకు సరిపోవని భావిస్తే వారికి పరీక్షలు రాసేలా ఛాన్స్ ఇవ్వనున్నారు అధికారులు.

    ఆలస్యమైతే ఆ విద్యార్థులకు ఇబ్బందులు
    పరీక్షలు బాగా ఆసల్యమైతే రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు, ఐఐటీ, ఎన్ఐటీల్లో చేరడానికి విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పరీక్షలు ఒక వేళ నిర్వహించినా కరోనా నేపథ్యంలో వాల్యువేషన్ కు ప్రైవేటు లెక్ఛరర్లు ఏ మేరకు సహకరిస్తారన్నది కూడా అధికారుల ముందు ప్రశ్నగా మారింది. దీంతో ఫలితాల వెల్లడికి చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది. మరో వైపు ఈ ఏడాది కనీసం నెల రోజులు కూడా క్లాస్ రూం తరగతులు జరగలేదు. మొత్తం ఆన్ లైన్ క్లాసులే జరిగాయి. ఆ క్లాసులు ఎంత మేరకు విద్యార్థులకు అర్థం అయ్యాయన్నది కూడా మరో అంతు చిక్కని ప్రశ్న. ఈ నేపథ్యంలో పరీక్షలు రద్దు చేయడమే మేలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. లేక పోతే గ్రామీణ ప్రాంతాలకు చెందిన, అందులో ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.

    ప్రాక్టికల్ పరీక్షలు కూడా రద్దే?
    అయితే ప్రాక్టికల్ పరీక్షలను కూడా ఇప్పట్లో నిర్వహించే పరిస్థితి లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఆ పరీక్షలను కూడా క్యాన్సెల్ చేయాలని వారు భావిస్తున్నారు. అయితే విద్యార్థులు రాసిన రికార్డుల ఆధారంగా ప్రాక్టికల్ పరీక్షలకు మార్కులు కేటాయించాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లో ప్రభుత్వం లేదా ఇంటర్ బోర్డు నుంచి ఈ విషయాలపై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
    Published by:Nikhil Kumar S
    First published: