హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS Inter Results 2022: నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఈ డైరెక్ట్ లింక్స్ తో రిజల్ట్స్ చెక్ చేసుకోండి

TS Inter Results 2022: నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఈ డైరెక్ట్ లింక్స్ తో రిజల్ట్స్ చెక్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో ఇంటర్ ఫలితాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యార్థులు ఇంటర్ బోర్డ్ వెబ్ సైట్లతో పాటు News18 Telugu వెబ్ సైట్లోనూ తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన లింక్స్ ఇవే..

లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చేస్తున్న తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు మరో కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఫలితాలను ఈ రోజు మధ్యాహ్నం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను https://tsbie.cgg.gov.in, https://results.cgg.gov.in, https://examresults.ts.nic.in వెబ్ సైట్లలో చూసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లతో పాటు News18 Telugu వెబ్‌సైట్‌ https://telugu.news18.com/ లో కూడా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. చాలా రోజులుగా తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలపై తీవ్ర ఉత్కంఠ సాగుతోంది. వారం క్రితమే ఫలితాలు వస్తాయన్న ప్రచారం సాగింది. అప్పటి నుంచి బోర్డు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడంతో ఫలితాలు ఎప్పుడు విడుదల అవుతాయో తెలియక విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర టెన్షన్ కు గురయ్యారు.

అయితే.. ఎట్టకేలకు ఆదివారం సాయంత్రం ఇంటర్ బోర్డు నుంచి అధికారిక ప్రకటన విడుదలవడంతో ఉత్కంఠకు తెరపడింది. బోర్డు ఫలితాల విడుదల తేదీపై క్లారిటీ రావడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటనలో పేర్కొంది ఇంటర్ బోర్డ్. వివిధ మాధ్యమాల్లో జరిగే అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని బోర్డు తన ప్రకటనలో విద్యార్థులకు సూచించింది.

News18 Telugu వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ చూసుకోవడం ఇలా..

Step 1- ముందుగా https://telugu.news18.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

Step 2- హోమ్ పేజీలో తెలంగాణ ఇంటర్ ఫలితాల లింక్ పైన క్లిక్ చేయండి.

Step 3- హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి.

Step 4- స్క్రీన్ పైన ఫలితాలు కనిపిస్తాయి.

Step 5- రిజల్ట్స్ కాపీని ప్రింట్ తీసుకొని PDF ఫార్మాట్‌లో సేవ్ చేసుకోవచ్చు.


బోర్డ్ వెబ్ సైట్లో ఇంటర్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు.

Step 1: ఫలితాల విడుదల అనంతరం అభ్యర్థులు మొదటగా ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://tsbie.cgg.gov.in ను ఓపెన్ చేయాలి.

Step 2: అనంతరం హోం పేజీలో ఇంటర్ రిజల్ట్స్ కు సంబంధించిన లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.

Step 3: కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

First published:

Tags: Exams, JOBS, TS Inter Results 2022

ఉత్తమ కథలు