news18-telugu
Updated: June 15, 2020, 8:58 AM IST
TS Inter Results 2020: తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే...
(ప్రతీకాత్మక చిత్రం)
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త. ఇంటర్ ఫలితాలు విడుదలయ్యే ముహూర్తం దగ్గరపడింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్టు జరిగితే జూన్ 16న తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఒకవేళ వీలుకాకపోతే జూన్ 17న ఖచ్చితంగా ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుతు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్-TSBIE కసరత్తు చేస్తోంది. అంటే ఈ రెండు రోజుల్లోనే తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల కావడం ఖాయం. ఏ రోజు అన్నది సోమవారం క్లారిటీ వస్తుంది. తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులతో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఫలితాల విడుదల తేదీని నిర్ణయిస్తారు.
ఫలితాలకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే పూర్తయినా ఒకటికి రెండు సార్లు అన్నీ సరిచూసుకొని రిజల్ట్స్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా గతంలో లాగా ప్రెస్ మీట్లో ఫలితాలు విడుదల చేసే అవకాశం లేదు. ఆన్లైన్లోనే నేరుగా ఫలితాలను విడుదల చేయనుంది తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. వాస్తవానికి ఈపాటికే ఇంటర్ ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. పరీక్షలు మార్చిలోనే పూర్తయినా కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఫలితాలు వాయిదా పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9.65 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంటర్ ఫలితాలను
https://telugu.news18.com/ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఫలితాలు వచ్చిన వెంటనే తెలుసుకోవాలంటే ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి.
Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
Career Guidance: ఇంటర్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు... చేయొచ్చు ఇలా
Courses After Inter: ఇంటర్ తర్వాత ఈ కోర్సులు చేయొచ్చుTelangana Jobs: తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 160 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Published by:
Santhosh Kumar S
First published:
June 15, 2020, 8:57 AM IST