Breaking News: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు... అధికారికంగా ప్రకటించిన బోర్డు... చెక్ చేయండి ఇలా

Telangana Inter Results 2020 | ఇంటర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ విద్యార్థులకు శుభవార్త. తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు జూన్ 18న కానున్నాయి. రిజల్ట్స్ ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

news18-telugu
Updated: June 17, 2020, 6:42 PM IST
Breaking News: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు... అధికారికంగా ప్రకటించిన బోర్డు... చెక్ చేయండి ఇలా
TS Inter Results 2020: రేపే ఇంటర్ ఫలితాలు... అధికారికంగా ప్రకటించిన బోర్డు... చెక్ చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తెలంగాణలో ఇంటర్ ఫలితాలు జూన్ 18న విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్-TSBIE అధికారికంగా ప్రకటించింది. ప్రశ్నాపత్రాల మూల్యాంకనం ఎప్పుడో పూర్తయింది. అయితే ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని ఫలితాలు విడుదల చేయాలనుకున్నారు. అందుకే ఫలితాల విడుదలకు కాస్త ఆలస్యమైంది. ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంది ఇంటర్ బోర్డు. గురువారం సాయంత్రం 3 గంటలకు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. బుధవారం సాయంత్రం ఇంటర్ బోర్డు సెక్రెటరీ ఒమర్ జలీల్ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో సమావేశమై ఇంటర్ ఫలితాల గురించి చర్చించనున్నారు.

తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ https://tsbie.cgg.gov.in/ తో పాటు ఇతర వెబ్‌సైట్లలో ఫలితాలు తెలుసుకోవచ్చు. ఇంటర్ ఫలితాలను https://telugu.news18.com/ వెబ్‌సైట్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలైన వెంటనే సమాచారం తెలుసుకోవాలంటే https://telugu.news18.com/ వెబ్‌సైట్‌లో విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ కింద ఇచ్చిన రిజిస్ట్రేషన్ విండోలో విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ లేదా సెకండ్ ఇయర్ సెలెక్ట్ చేసి, పూర్తి పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ అడ్రస్ వెల్లడించి రిజిస్టర్ చేసుకోవాలి. తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాలను విడుదల చేసిన వెంటనే విద్యార్థులకు సమాచారం అందుతుంది. రిజల్ట్స్ వచ్చిన వెంటనే విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.


తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ https://tsbie.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో ఇంటర్ ఫలితాలను తెలుసుకునేందుకు ఈ స్టెప్స్ ఫాలో అవండి.

ముందుగా https://tsbie.cgg.gov.in/ ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో ఇంటర్ ఫలితాలకు సంబంధించిన లింక్ పైన క్లిక్ చేయండి.
ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్‌కు వేర్వేరు లింక్స్ ఉంటాయి.

లింక్ క్లిక్ చేసిన తర్వాత హాల్ టికెట్ నెంబర్, ఇతర వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.
ఫలితాల కాపీని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసి భద్రపర్చుకోవాలి.

రాష్ట్ర వ్యాప్తంగా 9.65 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా గతంలో లాగా ప్రెస్ మీట్‌లో ఫలితాలు విడుదల చేసే అవకాశం లేదు. ఆన్‌లైన్‌లోనే నేరుగా ఫలితాలను విడుదల చేయనుంది తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Courses After Inter: ఇంటర్ తర్వాత ఈ కోర్సులు చేయొచ్చు

Career Guidance: ఇంటర్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు... చేయొచ్చు ఇలా

Courses after Inter: ఇంటర్ తర్వాత ఈ 123 కోర్సులు చేయొచ్చు... విద్యార్థులకు సీబీఎస్ఈ సలహా
Published by: Santhosh Kumar S
First published: June 17, 2020, 6:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading