Telangana Inter Results 2020: జూన్ 18న తెలంగాణ ఇంటర్ ఫలితాలు ?

Telangana Inter Results 2020: ప్రశ్నపత్రాల మూల్యాంకన ప్రక్రియను కూడా అధికారులు కొద్ది రోజుల క్రితమే పూర్తి చేశారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తరువాత ఫలితాలను విడుదల చేయాలని ఎదురుచూస్తున్నారు.

news18-telugu
Updated: June 16, 2020, 8:14 AM IST
Telangana Inter Results 2020: జూన్ 18న తెలంగాణ ఇంటర్ ఫలితాలు ?
TS Inter Results 2020: తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే... (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కొద్దిరోజుల క్రితమే ఏపీలో ఇంటర్ ఫలితాలు వెలువడటంతో... తెలంగాణలో ఇంటర్ ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రశ్నపత్రాల మూల్యాంకన ప్రక్రియను కూడా అధికారులు చాలారోజుల క్రితమే పూర్తి చేశారు. గత ఏడాది ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా రెండో సారి కూడా సరిచూసుకున్నారు.  ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తరువాత ఫలితాలను విడుదల చేయాలని ఎదురుచూస్తున్నారు. నేడు దీనిపై ప్రభుత్వానికి ఇంటర్ బోర్డు నివేదిక సమర్పించనుందని... రేపు ఫలితాల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చని తెలుస్తోంది. మరోవైపు స్కానింగ్‌తో పాటు ఇతర పాలనపరమైన ఏర్పాట్లన్నీ కూడా రెండు రోజుల క్రితమే పూర్తయ్యాయి.

ఫలితాలు సరిగ్గా వచ్చాయా? లేదంటే ఏమైనా లోపాలు ఉన్నాయా? అన్న దానిపై ఒకటికి రెండుసార్లు పరిశీంచారు. కరోనా నేపథ్యంలో ఈసారి ఫలితాలను నేరుగా ఆన్‌లైన్‌లోనే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తారు. గతేడాది తలెత్తిన సమస్యలు రాకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంతవరకు జరిగిన ప్రక్రియను మరోసారి పునర్ పరిశీలిస్తున్నారు. ఈ ప్రక్రియ కూడా మంగళవారంతో పూర్తి కానుంది. మొత్తానికి ఈనెల 18న ఫలితాలు ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.

Published by: Kishore Akkaladevi
First published: June 16, 2020, 8:13 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading