TS Inter Results 2020 | వచ్చేవారమే తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్..?

ప్రతీకాత్మక చిత్రం

మార్చి 15 తర్వాత ఏ క్షణమైనా పరీక్షల ఫలితాలను వెల్లడించేందుకు ఇంటర్మీడియట్ శాఖ సిద్ధంగా ఉంది.

  • Share this:
    తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చే వారమే విడుదల అయ్యే అవకాశం ఉంది. ఆ దిశగా అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. తెలంగాణలో కూడా వీలైనంత త్వరగా రిజల్ట్స్ రిలీజ్ చేయాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలు ఒకేసారి ప్రకటించేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోందని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. మే 12 నుంచి 30 వరకు సమాధాన పత్రాల మూల్యాంకనం నిర్వహించామన్న ఆయన... ఫలితాల నమోదు ప్రక్రియ తుది దశకు చేరుకుందని వెల్లడించారు. ప్రస్తుతం జవాబు పత్రాల స్కానింగ్, మార్కులు అప్‌లోడింగ్, తుది పరిశీలన, ఇంటర్నెట్ మెమోల రూపకల్పన వంటి సాంకేతిక ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు ఉమర్ జలీల్ పేర్కొన్నారు. ఈ మొత్తం ప్రక్రియ జూన్15 నాటికి పూర్తవుతుందని.. ఆ తర్వాత ఫలితాలను వెల్లడిస్తామని ఆయన చెప్పారు. మార్చి 15 తర్వాత ఏ క్షణమైనా పరీక్షల ఫలితాలను వెల్లడించేందుకు ఇంటర్మీడియట్ శాఖ సిద్ధంగా ఉంది. న్యూస్ 18కి అందుతున్న సమాచారం మేరకు వచ్చే వారం కచ్చితంగా ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యే అవకాశం ఉంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: