TS Inter Results 2020 | తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో సీఎం కేసీఆర్ సొంత జిల్లా లాస్ట్...

Telangana Inter Results Manabadi 2020 | తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్ చివరి స్థానంలో నిలిచింది.

news18-telugu
Updated: June 18, 2020, 4:38 PM IST
TS Inter Results 2020 | తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో సీఎం కేసీఆర్ సొంత జిల్లా లాస్ట్...
తెలంగాణ సీఎం కేసీఆర్
  • Share this:
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం, ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేశారు. ప్రకటించిన ఫలితాల ఆధారంగా చూస్తే ఇంటర్ మొదటి, రెండు సంవత్సరాల ఫలితాల్లోనూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సొంత జిల్లా మెదక్ చివరి స్థానంలో నిలిచింది. 33 జిల్లాల తెలంగాణలో మెదక్ జిల్లా లాస్ట్ వచ్చింది. మెదక్ జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం (జనరల్) పాస్ పర్సంటేజీ 34 శాతం. బాలురు 26 శాతం, బాలికలు 41 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ రెండో సంవత్సరం (జనరల్) పాస్ పర్సంటేజీ 42 శాతం. బాలికల్లో 49 శాతం, బాలురుల్లో 33 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారు.


అత్యధిక పాస్ పర్సంటేజీ (75 శాతం)తో మేడ్చల్ జిల్లా ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా కొమురం భీం ఆసిఫాబాద్ (74 శాతం), ములుగు (73 శాతం), రంగారెడ్డి (70), భద్రాద్రి కొత్తగూడెం (68), వరంగల్ అర్బన్ (68), ఖమ్మం (68), కరీంనగర్ (67), వనపర్తి (60), కామారెడ్డి (60 శాతం) ఉత్తీర్ణత శాతంతో మొదటి పది స్థానాల్లో నిలిచాయి. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా 56 శాతం పాస్ పర్సంటేజీతో 21వ స్థానంలో నిలిచింది. మరో మంత్రి హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా 56 శాతం పాస్ పర్సంటేజీతో 18వ స్థానంలో ఉంది.

మెదక్ జిల్లా ఇంటర్ ఫలితాలు (జనరల్)...




















బాలురు % బాలికలు % మొత్తం ఉత్తీర్ణత శాతం
ఇంటర్ మొదటి సంవత్సరం 26 41 34
ఇంటర్ రెండో సంవత్సరం 34 50 42
Published by: Ashok Kumar Bonepalli
First published: June 18, 2020, 4:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading