తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల తేదీలను సవరించినట్లు రాష్ట్ర ఇంటర్ బోర్డు తెలిపింది. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజవకర్గంలో ఉప ఎన్నిక కారణంగానే పరీక్షలను రీషెడ్యూల్ చేశామన్న బోర్డు.. సవరించిన తేదీలను శుక్రవారం వెల్లడించింది. ఈనెల 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానుండగా, షెడ్యూల్ ప్రకారం నవంబర్ 3న ముగుస్తాయి. రీషెడ్యూల్ లో రెండు పరీక్షల తేదీలను మార్చారు. ఈ నెల 25 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ (Inter First Year) పరీక్షలు యథాతథంగా మొదలవుతాయని, అయితే, 29, 30 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను ఉప ఎన్నిక నేపథ్యంలో వాయిదా వేశామని బోర్డు తెలిపింది.
రివైజ్డ్ టైం టేబుల్..
• అక్టోబర్ 25, 2021 సెకండ్ లాంగ్వేజ్
• అక్టోబర్ 26, 2021 ఇంగ్లీష్
• అక్టోబర్ 27, 2021 పేపర్-1ఏ, బోటని, పొలిటికల్ సైన్స్
• అక్టోబర్ 28, 2021 మ్యాథ్స్ పేపర్-1బీ, జువాలజీ , హిస్టరీ
• అక్టోబర్ 31, 2021 ఫిజిక్స్, ఎకనమిక్స్
• నవంబర్ 01, 2021 కెమిస్ట్రీ, కామర్స్
• నవంబర్ 02, 2021 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు, మ్యాథ్స్ Maths
• నవంబర్ 03, 2021 మోడరన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ
రీషెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 29న జరగాల్సిన పరీక్షలను అక్టోబర్ 31న నిర్వహిస్తారు. అలాగే, అక్టోబర్ 30న జరగాల్సిన పరీక్షలను నవంబర్ 1న పెడతారు.
బై ఎలక్షన్ కారణం..
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపధ్యంలో ఈ నెల 30వ తేదీన ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే, ఈ సెలవు ఆ నియోజకవర్గ పరిధిలోని వారికి మాత్రమే వస్తిస్తుందని, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంటల్ (Negotiable instrument Act) యాక్ట్ 1881 ప్రకారం పబ్లిక్ హాలిడేగా ప్రకటిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. అక్టోబర్ 8,2021తో హుజురాబాద్ ఉప ఎన్నికలో నామినేషన్ల సమర్పణ ప్రక్రియ ముగిసింది. ప్రధాన పార్టీలతో పాటు అనేకమంది స్వతంత్య్ర అభ్యర్థులు నామినేషన్లు (Nomination) ధాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే మొత్తం 61మంది పోటి చేసేందుకు నామినేషన్లు వేశారు. కాగా నామినేషన్ వేసిన అభ్యర్థులు వివరాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సి హెచ్ రవీందర్ రెడ్డి నేడు వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Exams postponed, Huzurabad By-election 2021, Intermediate exams, Telangana