హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS Inter Exams 2022: రేపటి నుంచే ఇంటర్ ఎగ్జామ్స్.. నిమిషం లేట్ అయినా నో ఎంట్రీ.. ఇంకా ఈ 10 రూల్స్ పాటించాల్సిందే..

TS Inter Exams 2022: రేపటి నుంచే ఇంటర్ ఎగ్జామ్స్.. నిమిషం లేట్ అయినా నో ఎంట్రీ.. ఇంకా ఈ 10 రూల్స్ పాటించాల్సిందే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో రేపటి నుంచే ఇంటర్ ఎగ్జామ్స్ (TS Inter Exams) ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఈ 10 రూల్స్ ను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని బోర్డు ( (TS Inter Board)) సూచించింది. వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలో ఇంటర్ ఎగ్జామ్స్ (TS Inter Exams 2022) నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఈ నెల 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. పరీక్షలు (Exams) సజావుగా నిర్వహించడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్త చర్యలను సైతం చేపట్టారు. రేపు అంటే శుక్రవారం నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్, ఎల్లుండి శనివారం నుంచి ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ ప్రారంభంకానున్నాయి ఇందుకోసం మొత్తం 1,443 కేంద్రాలను ఏర్పాటు చేసింది ఇంటర్ బోర్డ్. ఈ కేంద్రాల్లో మొత్తం 9.07 లక్షల మంది విద్యార్థులు పరీక్షలను రాయనున్నారు. కరోనా (Corona) కారణంగా గత రెండేళ్లుగా రాష్ట్రంలో ఇంటర్ ఎగ్జామ్స్ ను నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈసారి సిలబస్ ను 70 శాతానికి కుదించారు అధికారులు.

ప్రశ్నల్లో ఛాయిస్ ను సైతం భారీగా పెంచారు. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఇంటర్ ఎగ్జామ్స్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. అయితే.. నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్లలోకి అనుమతించేది లేదని ఇంటర్ బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది.

TS Inter Hall Tickets Download: ఆన్లైన్లోనే ఇంటర్ హాల్ టికెట్లు.. ఈ లింక్ తో డౌన్‌లోడ్‌ చేసుకోండి.. పూర్తి వివరాలివే

ఇంటర్ ఎగ్జామ్స్ సందర్భంగా ఇంటర్ బోర్డ్ విద్యార్థులకు పలు సూచనలు చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

1. విద్యార్థులను ఎగ్జామ్ సెంటర్లలోకి 8.30 నుంచే అనుమతిస్తారు. విద్యార్థులు 8.45 లోపే కేంద్రాల్లోని తమ సీట్లలో కూర్చునేలా ప్లాన్ చేసుకోవాలని బోర్డు సూచించింది.

2.కాలేజీల నుంచి హాల్ టికెట్ ను ఇప్పటివరకు పొందని విద్యార్థులు ఇంటర్ బోర్డు వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

3.హాల్ టికెట్ పై ఏమైనా తప్పులు ఉంటే వెంటనే సంబంధింత కాలేజీ ప్రిన్సిపాల్ దృష్టికి విషయాన్ని తీసుకుపోవాలని బోర్డు సూచించింది.

TS Inter Exams: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్... ఈ ఛాన్స్ ఒక్కసారి మాత్రమే

4.ఆన్సర్ షీట్ ఇవ్వగానే దానిపై ఉన్న నిబంధనలను జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది. హాల్ టికెట్ పై ఉన్న రిజిస్టర్డ్ నంబర్, ఓఎంఆర్ షీట్ పై ఉన్న రిజిస్టర్డ్ నంబర్ ఒకటేనా? కాదా? అన్నది విద్యార్థులు సరి చూసుకోవాలి. లేకపోతే ఫలితాల్లో తప్పులు వచ్చే అవకాశం ఉంటుందని బోర్డు హెచ్చరించింది.

5.పరీక్షా కేంద్రానికి వెళ్లే సమయంలో విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ ను వెంట తీసుకురావాల్సి ఉంటుంది. తనిఖీకి వచ్చిన అధికారులకు హాల్ టికెట్ ను చూపించాల్సి ఉంటుంది.

6.విద్యార్థులు ఆన్సర్ బుక్ పై పేరు, రిజిస్ట్రేషన్ నంబర్ లాంటి వివరాలను అస్సలు రాయవద్దని బోర్డు సూచించింది.

7.Very Short Answer టైప్ క్వశ్వన్స్ ఆన్సర్స్ అన్నీ ప్రశ్నాపత్రంలో ఇచ్చిన ఆర్డర్ లో వరుస క్రమంలో రాయాల్సి ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది.


8.పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు సైలెన్స్(Silence) మెయింటేన్ చేయాల్సి ఉంటుంది.

9.ఇలా చేసిన విద్యార్థులను మాల్ ప్రాక్టీస్ కింద బుక్ చేస్తామని బోర్డు స్పష్టం చేసింది. అవేంటంటే..

a. రాసిన, ప్రింట్ చేసిన మెటీరియల్ కానీ, బుక్స్ కానీ వెంట తీసుకువస్తే..

b. క్వశ్వన్ పేపర్, హాల్ టికెట్ పై ఆన్సర్లు రాస్తే..

c. ఇతరుల ఆన్సర్ బుక్స్ నుంచి కాపీ కొట్టడానికి ప్రయత్నిస్తే..

d. సెల్ ఫోన్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను వెంట తీసుకువస్తే..

10.విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రానికి మాత్రమే ఎగ్జామ్ రాయడానికి అనుమతి ఉంటుంది. ఇతర కేంద్రాల్లో ఎగ్జామ్ రాయడానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు.

First published:

Tags: Board exams, Exams, Telangana inter board, TS Inter Exams 2022

ఉత్తమ కథలు