విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటర్ ఫలితాలు ఎప్పుడో తెలుసా..?

ఇంటర్ ఫలితాలు వెల్లడి కాగానే విద్యార్థులు ఫలితాలను డౌన్ లోడు చేసుకునే వెబ్ కాపీతో పాటుగా డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన గ్రీటింగ్ మేసేజ్ పంపించేందుకు దోస్త్(డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ) కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి పేర్కొన్నారు.

news18-telugu
Updated: June 10, 2020, 7:15 AM IST
విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటర్ ఫలితాలు ఎప్పుడో తెలుసా..?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ ప్రభావం అన్నిరంగాలపై పడిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే విద్యారంగంపై ఆ ప్రభావం కాస్తంత ఎక్కువనే చెప్పాలి. ఇప్పటికే ప్రకటించాల్సిన ఇంటర్ ఫలితాలను లాక్‌డౌన్ సడలింపులివ్వడంతో ఈనెల 15న ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్ బోర్డు యోచిస్తోంది. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తోంది. అయితే గతంలోని లోపాలను దృష్టిలో పెట్టుకుని ఫలితాలను జాగ్రత్తగా తనిఖీ చేయాలని బోర్డు భావిస్తోంది. ఆ క్రమంలోనే 15న కుదరకపోతే 17 ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది.

ఇదిలావుంటే.. ఇంటర్ ఫలితాలు వెల్లడి కాగానే విద్యార్థులు ఫలితాలను డౌన్ లోడు చేసుకునే వెబ్ కాపీతో పాటుగా డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన గ్రీటింగ్ మేసేజ్ పంపించేందుకు దోస్త్(డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ) కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి పేర్కొన్నారు. దీనికితోడు ఇంటర్ ఫలితాలు ప్రకటించిన మరుసటి రోజే డిగ్రీ ప్రవేశాలకు సంబంధిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 20 నుంచి 30 మధ్యలో డిగ్రీ ప్రవేశాల దరఖాస్తులు ప్రారంభం కానుంది. వచ్చే నెలలో మొదటి దశ సీట్ల కేటాయింపును ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Published by: Narsimha Badhini
First published: June 10, 2020, 7:13 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading