Telangana Inter Exams: రేపటి నుంచే ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్.. పాస్ కాకపోతే మళ్లీ పరీక్ష.. ఇంకా విద్యార్థులు తెలుసుకోవాల్సిన విషయాలివే..

ఇంటర్ బోర్డు లోగో(ప్రతీకాత్మక చిత్రం)

రేపటి నుంచి తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు (Telangana Inter First Year Exams) జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు సెక్రటరీ జలీల్ పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి.

  • Share this:
    తెలంగాణలో రేపటి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ (Telangana Inter First Year Exams) ను రేపటి నుంచి నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కరోనా (Corona) కారణంగా గతేడాది ఆన్లైన్ విధానంలోనే క్లాసులు (Online Classes) నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా ప్రభావం కారణంగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులను ఆ సమయంలో పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసింది సర్కార్. అయితే ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గడంతో ఆ విద్యార్థులకు పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే.. ఈ సందర్భంగా ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ (Telangana Intermediate Board Secretary Omer Jaleel) తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది సైతం కరోనా కారణంగా రెండో సంవత్సరం పరీక్షలను (Inter Second Year Exams) నిర్వహించలేని పరిస్థితి ఏర్పడితే విద్యార్థులు ఫస్ట్ ఇయర్ లో సాధించే మార్కులనే (Inter First Year Marks) ప్రమాణికంగా తీసుకుని వాటి ఆధారంగానే పాస్ చేసే అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు టెన్త్ ఎగ్జామ్స్ (Tenth Exams) రాయకుండానే పాసైన విషయాన్ని జలీల్ గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు కూడా ఎగ్జామ్స్ లేకుండా పాస్ చేస్తే విద్యార్థులు నష్టపోయే ప్రమాదముందన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకునే పరీక్షలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

    ఫెయిల్ అయితే..
    ఒక వేళ విద్యార్థులు ఈ పరీక్షల్లో ఫెయిల్ అయితే మళ్లీ పరీక్ష రాయాల్సిందేనని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ స్పష్టం చేశారు. విద్యార్థులను కనీస మార్కులతో పాస్ చేసే అవకాశమే లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. అలాంటి విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించే అవకాశంపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. లేక పోతే మార్చి/ఎప్రిల్ లో మళ్లీ పరీక్షలు రాసి పాస్ కావాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం 70 శాతం సిలబస్ తోనే పరీక్షలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 50 శాతానికి పైగా ఛాయిస్ రూపంలో ప్రశ్నలు ఉంటాయని వివరించారు.
    Telangana : తెలంగాణ ఇంటర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ హాల్‌టికెట్లు విడుద‌ల‌.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

    విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన విషయాలివే..
    -కరోనా సోకిన విద్యార్థుల ను పరీక్షలకు అనుమతించమని అధికారులు తెలిపారు. ఇలాంటి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించనున్నారు.
    -జ్వరం, దగ్గు, జలుబు తదితర కోవిడ్ లక్షణాలున్న విద్యార్థులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసొలేషన్‌ గదుల్లో పరీక్షలు రాసుకునేందుకు అనుమతిస్తారు.
    -విద్యార్థులకు మాస్కులు తప్పనిసరి. మాస్కులు తీసుకురాని విద్యార్థులకు ఉచితంగా మాస్కులను అందించనున్నారు.
    Telangana Inter Exams : ప‌రీక్ష‌లంటే భ‌య‌మా.. అయితే కాల్ చేయండి : క్లినిక‌ల్ సైకాల‌జిస్టు ప్యాన‌ల్‌ ప్ర‌వేశ‌పెట్టిన ఇంట‌ర్ బోర్డు

    -ఎగ్జామ్ సెంటర్స్ వద్ద విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాల్లో ఉమ్మివేయడాన్ని నిషేధించారు.
    -విద్యార్థులు శానిటైజర్‌, వాటర్ బాటిల్ ను వెంట్ తీసుకువచ్చేందకు అనుమతి ఇచ్చారు.
    -హాల్ టికెట్ పై ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు.
    Published by:Nikhil Kumar S
    First published: