తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ మారింది. సవరించిన తేదీలను తెలంగాణ ఇంటర్ బోర్డు (Telangana Inter Board) విడుదల చేసింది. మే 6 నుంచి తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్ (TS Inter Exams) ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలను ముందుగానే ప్రకటించింది. ఆ తర్వాత జేఈఈ పరీక్షల తేదీలు వచ్చాయి. దీంతో తెలంగాణ ఇంటర్ పరీక్ష తేదీలతో క్లాష్ కావడంతో తెలంగాణ ఇంటర్ బోర్డు పరీక్ష తేదీలను సవరించింది. ఏప్రిల్ 22 నుంచి మే 7 వరకు పరీక్షలు ఉంటాయని ప్రకటించింది. మళ్లీ జేఈఈ పరీక్షల తేదీలు మారాయి. ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు జరగనున్నాయి. ఈ తేదీలు తెలంగాణ ఇంటర్ పరీక్ష తేదీలతో మళ్లీ క్లాష్ అవుతున్నాయి.
తెలంగాణ ఇంటర్ పరీక్షలు, జేఈఈ ఎగ్జామ్స్ ఒకేసారి రావడంతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. దీంతో ఇంటర్ బోర్డు మరోసారి పరీక్ష తేదీలను మార్చక తప్పలేదు. మరోసారి తెలంగాణ ఇంటర్ బోర్డు రివైజ్డ్ షెడ్యూల్‍ను ప్రకటించింది. మార్చిన షెడ్యూల్ ప్రకారం మే 6 నుంచి మే 24 వరకు తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ ఇక్కడ చూడొచ్చు.
మే 6- 2nd లాంగ్వేజ్ పేపర్ I
మే 9- ఇంగ్లీష్ పేపర్-I
మే 11- మ్యాథమెటిక్స్ పేపర్-IA, బోటనీ పేపర్-I, పొలిటికల్ సైన్స్ పేపర్ I
మే 13- మ్యాథమెటిక్స్ పేపర్-IB, జువాలజీ పేపర్-I, హిస్టరీ పేపర్ I
మే 16- ఫిజిక్స్ పేపర్-I, ఎకనమిక్స్ పేపర్ I
మే 18- కెమిస్ట్రీ పేపర్-I, కామర్స్ పేపర్ I
మే 20- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-I, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-I(బైపీసీ విద్యార్థులకు)
మే 23- మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ -I, జాగ్రఫీ పేపర్-I
మే 7- 2nd లాంగ్వేజ్ పేపర్ II
మే 10- ఇంగ్లీష్ పేపర్-II
మే 12- మ్యాథమెటిక్స్ పేపర్-IIA, బోటనీ పేపర్-II, పొలిటికల్ సైన్స్ పేపర్ II
మే 14- మ్యాథమెటిక్స్ పేపర్-IIB, జువాలజీ పేపర్-II, హిస్టరీ పేపర్ II
మే 17- ఫిజిక్స్ పేపర్-II, ఎకనమిక్స్ పేపర్ II
మే 19- కెమిస్ట్రీ పేపర్-II, కామర్స్ పేపర్ II
మే 21- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-II(బైపీసీ విద్యార్థులకు)
మే 24- మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ -II, జాగ్రఫీ పేపర్-II
ఇక జనరల్, వొకేషనల్ కోర్సులకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు జరుగుతాయి. ఆదివారాలు కూడా ఈ పరీక్షలు ఉంటాయి. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Telangana inter board, Telangana intermediate board exams, TS Inter Exams 2022