తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను త్వరలో విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డ్ (Telangana Inter Board) సన్నాహలు చేస్తోంది. డిసెంబర్ మొదటి వారంలో ఫలితాలను (TS Inter Results) విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు వర్గాలు వెల్లడించాయి. కరోనా (Corona) నేపథ్యంలో గత మార్చిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను (TS Inter Exams) అధికారులు నిర్వహించలేదు. పరీక్షలు లేకుండానే ఆయా విద్యార్థులను సెకండియర్ లోకి ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం (Telangana Government) నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గడం, రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనడంతో అక్టోబర్ 25 నుంచి ఈ నెల 3 వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలను అధికారులు నిర్వహించారు. ఆయా పరీక్షలకు సంబంధించిన స్పాట్ వాల్యుయేషన్ ను ఈ నెల 19 వరకు నిర్వహించారు. అయితే వాల్యుయేషన్ కు ప్రైవేటు కాలేజీల అధ్యాపకులు సరిగా హాజరు కాకపోవడంతో ఆ ప్రక్రియ కాస్త ఆలస్యమైంది.
ప్రస్తుతం వాల్యుయేషన్ ముగియడంతో డేటాను నమోదు చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలో ఈ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే.. కరోనా నేపథ్యంలో గతేడాది విద్యా సంవత్సరం అంతా గందరగోళంగా సాగింది. ఆన్లైన్ క్లాసులు నిర్వహించిన అవి విద్యార్థులకు ఎంతవరకు అర్థమయ్యాయో తెలియని దుస్థితి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, ఇంటర్ నెట్ అందుబాటులో లేని పేద విద్యార్థుల పరిస్థితి మరీ బాధాకరం. అయితే.. గతేడాది పరీక్షలు లేకుండానే వీరందరినీ సెకండియర్ లోకి ప్రమోట్ చేసిన ప్రభుత్వం మళ్లీ ఎగ్జామ్స్ నిర్వహించడంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
అయినా.. ప్రభుత్వం పరీక్ష నిర్వహణను ఆపలేదు. దీంతో విద్యార్థులు ఒక వేళ ఫెయిల్ అయితే కనీస మార్కులతో పాస్ చేయాలని ఆయా వర్గాల నుంచి వినతులు వస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులను పరిగణలోకి తీసుకుని విద్యార్థులు నష్టపోకుండా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అయితే.. ఫలితాలు విడుదలైన అనంతరమే ఫెయిల్ అయిన విద్యార్థుల విషయంలో సర్కార్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. తెలంగాణ ఇంటర్ బోర్డ్ (Telangana Inter Board) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా (Corona) ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులకు (Students) బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ (TS Inter Exams) కు సంబంధించి సిలబస్ ను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 30 శాతం సిలబస్(TS Inter Exams Syllabus) ను తగ్గిస్తున్నట్లు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ విద్యార్థులకు 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు అడగనున్నట్లు ఇంటర్ బోర్డ్ వెల్లడించింది.
అయితే.. తగ్గించిన 30 శాతం, మిగతా 70 శాతం సిలబస్ వివరాలను, మోడల్ ఎగ్జామ్ పపేపర్లను విద్యార్థులు ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్ సైట్ https://tsbie.cgg.gov.in/ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని ఇంటర్ బోర్డ్ తెలిపింది. కరోనా (Covid 19) కారణంగా ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరంలో దాదాపు మూడు నెలల పాటు ప్రత్యక్ష తరగతులు నిర్వహించలేని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఈ నేపథ్యంలో సిలబస్ ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి జలీల్ వెల్లడించారు. సెప్టెంబరు 1వ తేదీ వరకు కూడా టీవీల ద్వారానే విద్యార్థులకు పాఠాలు బోధించాల్సి వచ్చిందని ఆయన వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, Telangana inter board, Telangana Inter Results