తెలంగాణ ఇంటర్ బోర్డ్ (Telangana Inter Board) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా (Corona) ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులకు (Students) బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ (TS Inter Exams) కు సంబంధించి సిలబస్ ను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 30 శాతం సిలబస్(TS Inter Exams Syllabus) ను తగ్గిస్తున్నట్లు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ విద్యార్థులకు 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు అడగనున్నట్లు ఇంటర్ బోర్డ్ వెల్లడించింది. అయితే తగ్గించిన 30 శాతం, మిగతా 70 శాతం సిలబస్ వివరాలను, మోడల్ ఎగ్జామ్ పపేపర్లను విద్యార్థులు ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్ సైట్ https://tsbie.cgg.gov.in/ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని ఇంటర్ బోర్డ్ తెలిపింది. కరోనా (Covid 19) కారణంగా ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరంలో దాదాపు మూడు నెలల పాటు ప్రత్యక్ష తరగతులు నిర్వహించలేని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఈ నేపథ్యంలో సిలబస్ ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి జలీల్ వెల్లడించారు. సెప్టెంబరు 1వ తేదీ వరకు కూడా టీవీల ద్వారానే విద్యార్థులకు పాఠాలు బోధించాల్సి వచ్చిందని ఆయన వివరించారు.
ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా 30శాతం సిలబస్ ను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన వివరించారు. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా విద్యార్థులకు ప్రశ్నాపత్రాలు రూపొందించనున్నట్లు జలీల్ తెలిపారు. ఇదిలా ఉంటే తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఇంత వరకు అడ్మిషన్ పొందలేని వారికి సైతం బోర్డ్ శుభవార్త చెప్పింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల గడువును పొడపిస్తూ నిర్ణయించింది. ఈ మేరకు బోర్డ్ కార్యదర్శి జలీల్ ప్రకటన విడుదల చేశారు.
AISSEE -2022: సైనిక్ స్కూల్లో అడ్మిషన్‌కు దరఖాస్తు చేశారా.. పరీక్ష విధానం తెలుసుకోండి
ప్రవేశాల గడువును పొడిగించాలని కాలేజీలు, వివిధ యూనియన్ల నుంచి తమకు అభ్యర్థనలు అందాయన్నారు. వారి అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుని ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు జలీల్ వివరించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరడానికి ఇదే చివరి అవకాశమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు కాలేజీల్లో అడ్మిషన్ తీసుకోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
Scholarship: కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారా..? అయితే ఈ స్కాలర్షిప్ మీ కోసమే
తెలంగాణలో ఇంటర్ ఎగ్జామ్స్ టైం టేబుల్ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది కరోనా కారణంగా ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులను పరీక్షలు లేకుండానే పాస్ చేసిన ఇంటర్ బోర్డు.. ఫస్ట్ ఇయర్ విద్యార్థులను పరీక్షలు నిర్వహించకుండానే సెకండియర్ లోకి ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో ఇటీవల ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ను నిర్వహించింది ఇంటర్ బోర్డు. అయితే ఆ పరీక్షలకు సంబంధించిన మూల్యాంకనానికి ప్రభుత్వ కాలేజీల అధ్యాపకులు మాత్రమే పూర్తి స్థాయిలో హాజరయ్యారు.
Online Course: కంప్యూటర్ సైన్స్ టీచింగ్ స్కిల్స్‌పై ఆన్లైన్ కోర్స్.. ఫీజు, దరఖాస్తు విధానం
ప్రైవేటు కాలేజీల నుంచి మాత్రం అధ్యాపకులు సరిగా హాజరుకాలేదు. దీంతో మూల్యాంకనం ఆశించినంత వేగంగా జరగలేదు. పరీక్షలు, మూల్యంకనం కారణంగా ఆయా విధులకు హాజరవుతున్న అధ్యాపకులు పని చేసే కాలేజీల్లో తరగతులు జరగలేదు. దీంతో సిలబస్ షెడ్యూల్ ప్రకారం పూర్తయ్యే అవకాశం లేదని ఇంటర్ బోర్డ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎగ్జామ్స్ టైం టేబుల్ లో మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది మార్చి 23 నుంచి ఏప్రిల్ 14 వరకు రాష్ట్రంలో ఇంటర్ ఎగ్జామ్స్ ను నిర్వహిస్తామని ఇంటర్ బోర్డ్ గతంలో వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Exams, Intermediate exams, Telangana inter board