• Home
  • »
  • News
  • »
  • jobs
  • »
  • TELANGANA INTER BOARD KEY ANNOUNCEMENT OVER INTER EXAMS RESULTS AND COMMENCEMENT OF ONLINE CLASSES NS

Telangana Inter Results: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఫలితాలు, ఆన్లైన్ క్లాసులపై బోర్డు కీలక ప్రకటన.. వివరాలివే

ఇంటర్ బోర్డు లోగో

తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్షల ఫలితాలు, ఆన్లైన్ క్లాసులపై ఇంటర్ బోర్డు కార్యదర్శి కీలక ప్రకటన చేశారు. ఆయన ఏమన్నారంటే..

  • Share this:
    కరోనా కారణంగా తెలంగాణ ప్రభుత్వం టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో.. ఫలితాల విడుదలపై విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇంటర్ బోర్డ్ సెక్రటరీ ఉమర్ జలీల్ కీలక ప్రకటన చేశారు. మరో వారంలో ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఫలితాల విడుదలకు సంబంధించి ఏర్పాటు చేసిన కీలక కమిటీ ఇచ్చిన నివేదికను రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియాకు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఉమర్ జలీల్ మంగళవారం అందజేశారు. అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్కుల ఆధారంగానే సెకండ్ ఇయర్ మార్కులను కేటాయించాలని కమిటీ సూచించినట్లు సమాచారం. ఈ కమిటీ నివేదికను ప్రభుత్వం ఆమోదించిన ఒకటి రెండు రోజుల్లోనే ఇంటర్ బోర్డు ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఇంటర్ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసుల విషయంలోనూ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ కీలక ప్రకటన చేశారు. వచ్చే నెల అంటే జూలై 1వ తేదీ నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్ధులకు ఆన్‌లైన్ క్లాసులను ప్రారంభించనున్నట్లు చెప్పారు.  ప్రథమ సంవత్సరం అడ్మిషన్లు ముగిసిన వెంటనే జూలై నెల మధ్యలో ఆ విద్యార్థులకు క్లాసులు ప్రారంభిస్తామని చెప్పారు.
    Telangana Summer Holidays: తెలంగాణలో వేసవి సెలవులు పెంపు.. ఆన్ లైన్ క్లాసులు ఆరోజు నుంచేనా?
    Telangana: ఐసెట్ తో సహా పలు కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వివరాలివే

    ఆన్లైన్ క్లాసులకు సంబంధించి సిలబస్ విషయంలోనూ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. గత విద్యా సంవత్సరం లాగానే ఈ 2021-22 అకాడమిక్ ఇయర్ కు సంబంధించి 70 శాతం సిలబస్ ఆధారంగా ఆన్లైన్ విధానంలో క్లాసులు నిర్వహించనున్నారు. అయితే గతేడాది టీవీలు, స్మార్ట్ ఫోన్లు లేని పేద వర్గాలు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో అలంటి విద్యార్థుల కోసం ఆయా కాలేజీల్లోనే డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకోసం 200 ప్రైవేటు కాలేజీలకు పర్మిషన్ ఇచ్చినట్లు సమాచారం.

    ఇదిలా ఉంటే.. కరోనా ప్రభావం విద్యారంగంపై విపరీతంగా పడింది. విద్యార్థులు విద్యాసంవత్సరం కోల్పోకుండా ఉండాలని గతేడాది ఆన్లైన్ క్లాసులను నిర్వహించినా.. అవి ఎంత మేరకు విద్యార్థులకు అర్థం అయ్యాయి? అన్నది ఇప్పటికే అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలింది. కరోనా ప్రభావం తగ్గడంతో పరీక్షలు నిర్వహించాలని అధికారులు, ప్రభుత్వం భావించినా సెకండ్ వేవ్ విజృంభణతో తెలంగాణలో టెన్త్ ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. దేశ వ్యాప్తంగా సీబీఎస్ఈ తో పాటు అనేక బోర్డు పరీక్షలను రద్దు చేశాయి ప్రభుత్వాలు. ఈ కొత్త విద్యా సంవత్సరం కూడా ఆన్లైన్ లోనే తిరిగి క్లాసులు ప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.
    Published by:Nikhil Kumar S
    First published: