హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS Inter Exam Fee: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్ ఫీజుపై బోర్డు కీలక ప్రకటన..

TS Inter Exam Fee: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్ ఫీజుపై బోర్డు కీలక ప్రకటన..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ ఇంటర్ బోర్డ్ (TS Inter Board) తాజాగా ఇంటర్ ఎగ్జామ్ ఫీజుపై (Exam Fee) కీలక ప్రకటన చేసింది. విద్యార్థులు ఎంత ఫీజు చెల్లించాలి అన్న అంశంపై స్పష్టమైన ప్రకటన చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.

    తెలంగాణ ఇంటర్ బోర్డ్ (Telangana Inter Board) తాజాగా కీలకప్రకటన చేసింది. ఇటీవల ఎగ్జామ్ ఫీజుకు (TS Inter Exam Fee) సంబంధించి తేదీలను ప్రకటించిన ఇంటర్ బోర్డ్ తాజాగా ఏ విద్యార్థులు (Students) ఎంత ఫీజు చెల్లించాలన్న వివరాలకు సంబంధించి స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    TS Inter General Stream:

    ఇంటర్ ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ (Arts&Science) విద్యార్థులు 490 రూపాయలు ఎగ్జామ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

    -సెకండియర్ రెగ్యులర్ (Arts) విద్యార్థులు రూ. 490 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

    -సెకండియర్ రెగ్యులర్ (Science) విద్యార్థులు ఎగ్జామ్ ఫీజు(490)+ప్రాక్టికల్స్(200) మొత్తం 690 చెల్లించాల్సి ఉంటుంది.

    TS Inter Vocational Stream:

    -ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ (ఒకేషనల్) విద్యార్థులు రూ.690 ఎగ్జామ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

    -సెకండ్ ఇయర్ రెగ్యులర్ (ఒకేషనల్) అభ్యర్థులు రూ.690 ఎగ్జామ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

    -బ్రిడ్జ్ కోర్సు కలిపితే ఈ విద్యార్థులు రూ.840 ఎగ్జామ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

    Telangana: విద్యార్థులకు శుభవార్త.. తెలంగాణలో వారంతా పాస్.. అధికారిక ప్రకటన విడుదల

    ప్రైవేట్ విద్యార్థులకు సంబంధించి ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి.

    -ఫస్ట్ ఇయర్ బ్యాక్ లాగ్ విద్యార్థులు ఒకటి లేదా ఎన్ని సబ్జెక్టులు ఉన్నా రూ. 490 ఎగ్జామ్ ఫీజుగా చెల్లిస్తే సరిపోతుంది.

    -సెకండియర్ విద్యార్థులు సైతం ఇదే మాదిరిగా రూ.490 చెల్లిస్తే సరిపోతుంది.

    IIT, NIT Admissions: ఐఐటీలో ఇంజనీరింగ్​ చేయడమే మీ లక్ష్యమా..? అయితే, జేఈఈ మెయిన్​​ కోసం ఇలా ప్రిపేవరవ్వండి..

    ఇంప్రూవ్మెంట్: ఇటీవల విడుదలైన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో వచ్చిన మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ రాసే అవకాశాన్ని సైతం ఇంటర్ బోర్డ్ కల్పించింది. అభ్యర్థులు రూ. 490తో పాటు ప్రతీ సబ్జెక్టుకు రూ. 150 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

    -ఇంతకు మించి అదనంగా ఫీజులు వసూలు చేసే యాజమాన్యాలపై కఠినంగా చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డ్ హెచ్చరించింది.


    ఇదిలా ఉంటే.. విద్యార్థులు ఈ నెల 5 నుంచి 24వ తేదీ వరకు ఫీజులు చెల్లించాలని ఇంటర్ బోర్డ్ సూచించింది. రూ. 100 లేట్ ఫీజుతో జనవరి 25 నుంచి 31వ తేదీ వరకు ఫీజులు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డ్ తెలిపింది. రూ.500 లేట్ ఫీజుతో ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 7 వరకు ఎగ్జామ్ ఫీజ్ చెల్లించడానికి అవకాశం ఉన్నట్లు తెలిపింది ఇంటర్ బోర్డ్. ఇంకా ఫిబ్రవరి 14 వరకు రూ. 1000 లేట్ ఫీజుతో రూ. 2 వేల లేట్ ఫీజుతో ఫిబ్రవరి 21 వరకు ఎగ్జామ్ ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించిందినట్లు స్పష్టం చేసింది ఇంటర్ బోర్డ్.

    ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్న ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ రెగ్యులర్ విద్యార్థులు, గతంలో ఫెయిలయిన వారు, ప్రైవేటు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్ బోర్డ్ సూచించింది. అయితే ఈ అక్టోబర్ లో నిర్వహించిన ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన ప్రస్తుతం సెకండియర్ విద్యార్థులకు కూడా బోర్డ్ గుడ్ న్యూస్ చెప్పింది. మార్కులు తక్కువగా వచ్చాయని భావించిన విద్యార్థులు ఏప్రిల్ 2022లో ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ రాసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఇంటర్ బోర్డ్ తెలిపింది. ఆయా విద్యార్థులు పైన సూచించిన తేదీల ప్రకారం ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.

    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Career and Courses, Intermediate exams, Telangana inter board

    ఉత్తమ కథలు