శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలకు భారీ షాక్.. రోజుకు రూ.1 లక్ష ఫైన్..

రాష్ట్రంలోని ప్రైవేటు ఇంటర్ కాలేజీలపై తెలంగాణ ఇంటర్ బోర్డు కొరడా ఝులిపించింది. నిబంధనలకు విరుద్ధంగా దసరా సెలవుల్లో క్లాసులు నిర్వహించినందుకు ఆ కాలేజీలకు షాక్ ఇస్తూ భారీ జరిమానా విధించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ నిర్ణయం తీసుకున్నారు.

news18-telugu
Updated: October 30, 2019, 6:28 PM IST
శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలకు భారీ షాక్.. రోజుకు రూ.1 లక్ష ఫైన్..
శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలపై ఇంటర్ బోర్డు కొరడా
  • Share this:
రాష్ట్రంలోని ప్రైవేటు ఇంటర్ కాలేజీలపై తెలంగాణ ఇంటర్ బోర్డు కొరడా ఝులిపించింది. నిబంధనలకు విరుద్ధంగా దసరా సెలవుల్లో క్లాసులు నిర్వహించినందుకు ఆ కాలేజీలకు షాక్ ఇస్తూ భారీ జరిమానా విధించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ నిర్ణయం తీసుకున్నారు. సెలవుల్లో క్లాసులు నిర్వహించిన కాలేజీలు ఒక్కో రోజుకు రూ.1లక్ష జరిమానా చెల్లించాలని ఆయన ఆదేశించారు. కొన్ని కాలేజీలకు రూ.7 లక్షల వరకు జరిమానా విధించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 కాలేజీలు సెలవుల్లో క్లాసులు నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. వాటిలో 47 కాలేజీలు శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలే ఉన్నట్లు వారు తెలిపారు. ఆ కాలేజీలకు నోటీసులు జారీ చేసిన ఇంటర్ బోర్డు.. నవంబరు 2 లోగా జరిమానా చెల్లించాలని, లేకపోతే కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది.

విద్యార్థులకు అన్యాయం జరగకుండా.. ఆ కాలేజీల్లో చదువుతున్నవారిని ప్రభుత్వ కాలేజీల తరఫున పరీక్ష రాయిస్తామని కూడా హెచ్చరిక జారీ చేసింది. దీంతో.. కాలేజీల యాజమాన్యాలు ఇంటర్‌ బోర్డు కార్యాలయానికి క్యూ కట్టాయి. మరోవైపు.. రాష్ట్రంలో ఉన్న 404 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల విద్యార్థుల్లో ఒత్తిడి దూరం చేసి, వారికి కెరీర్ గైడెన్స్ ఇచ్చేందుకు ప్రతి కాలేజీలో ఒక కౌన్సిలర్‌ను నియమించాలని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ నిర్ణయం తీసుకున్నారు.

First published: October 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>