తెలంగాణ ఇంటర్ బోర్డ్ (Telangana Inter Board) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ విద్యార్థులు పరీక్ష ఫీజును (Exams) జనవరి 24లోగా చెల్లించాలని గతంలో ఇంటర్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. అయితే కరోనా నేపథ్యంలో జనవరి 30 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది ఇంటర్ బోర్డ్. ఈ నేపథ్యంలో విద్యార్థులు కాలేజీలకు వెళ్లి ఫీజులు చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డ్ విద్యార్థులకు ఊరట కలిగేలా నిర్ణయం తీసుకుంది. పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు ఎలాంటి లేట్ ఫీజు లేకుండా ఫిబ్రవరి 4 వరకు ఎగ్జామ్ ఫీజులు చెల్లించవచ్చని బోర్డ్ స్పష్టం చేసింది. ఇంకా లేట్ ఫీజుతో ఫిబ్రవరి 24 వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించింది ఇంటర్ బోర్డ్.
బోర్డు విడుదల చేసిన ప్రకటన ప్రకారం విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి.
TS Inter General Stream:
ఇంటర్ ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ (Arts&Science) విద్యార్థులు 490 రూపాయలు ఎగ్జామ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
-సెకండియర్ రెగ్యులర్ (Arts) విద్యార్థులు రూ. 490 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
-సెకండియర్ రెగ్యులర్ (Science) విద్యార్థులు ఎగ్జామ్ ఫీజు(490)+ప్రాక్టికల్స్(200) మొత్తం 690 చెల్లించాల్సి ఉంటుంది.
TS Inter Vocational Stream:
-ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ (ఒకేషనల్) విద్యార్థులు రూ.690 ఎగ్జామ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
-సెకండ్ ఇయర్ రెగ్యులర్ (ఒకేషనల్) అభ్యర్థులు రూ.690 ఎగ్జామ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
-బ్రిడ్జ్ కోర్సు కలిపితే ఈ విద్యార్థులు రూ.840 ఎగ్జామ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
ప్రైవేట్ విద్యార్థులకు సంబంధించి ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి.
-ఫస్ట్ ఇయర్ బ్యాక్ లాగ్ విద్యార్థులు ఒకటి లేదా ఎన్ని సబ్జెక్టులు ఉన్నా రూ. 490 ఎగ్జామ్ ఫీజుగా చెల్లిస్తే సరిపోతుంది.
-సెకండియర్ విద్యార్థులు సైతం ఇదే మాదిరిగా రూ.490 చెల్లిస్తే సరిపోతుంది.
ఇంప్రూవ్మెంట్: ఇటీవల విడుదలైన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో వచ్చిన మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ రాసే అవకాశాన్ని సైతం ఇంటర్ బోర్డ్ కల్పించింది. అభ్యర్థులు రూ. 490తో పాటు ప్రతీ సబ్జెక్టుకు రూ. 150 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
-ఇంతకు మించి అదనంగా ఫీజులు వసూలు చేసే యాజమాన్యాలపై కఠినంగా చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డ్ హెచ్చరించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.