• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • TELANGANA INTER BOARD APPOINTED SPECIAL COMMITTEE WITH PSYCHOLOGISTS FOR TO REDUCE STRESS AMONG STUDENTS NS

Telanana Inter Board: తెలంగాణలోని ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. మానసిక నిపుణులతో ప్యానల్ ఏర్పాటు చేసిన బోర్డు.. ఎందుకంటే

Telanana Inter Board: తెలంగాణలోని ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. మానసిక నిపుణులతో ప్యానల్ ఏర్పాటు చేసిన బోర్డు.. ఎందుకంటే

ఇంటర్ బోర్డు లోగో

తెలంగాణలో ప్రభుత్వం ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను పరీక్షలను లేకుండానే ప్రమోట్ చేయడంతో పాటు సెకండియర్ పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు ఎంసెట్, జేఈఈ, నీట్ లాంటి ప్రవేశ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయన్న విషయంపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

  • Share this:
    కరోనా ఎఫెక్ట్ విద్యారంగంపై అత్యధికంగా పడింది. ఈ మహమ్మారి కారణంగా విద్యార్థులు ఏడాదిగా క్లాస్ రూం తరగతులకు దూరమైన పరిస్థితి ఏర్పడింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలన్న లక్ష్యంతో గతేడాది అనేక బోర్డు పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వాలు ఈ ఏడాది కూడా అదే పని చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతోంది. అయితే పరీక్షల రద్దు, వాయిదాతో కొంత మంది విద్యార్థుల్లో హర్షం వ్యక్తం అవుతోంటే.. మరి కొందరిలో మాత్రం ఆందోళన కనిపిస్తోంది. పరీక్షల్లో సత్తా చాటి మంచి మార్కులు సాధించాలనుకున్న వారు ప్రభుత్వాల నిర్ణయాలతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే వివిధ ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారి పరిస్థితి మరి ఇబ్బందికరంగా మారింది. ఏ పరీక్ష ఎప్పుడు ఉంటుందో తెలియక వారు ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఎన్ని రోజుల పాటు తమ ప్రిపరేషన్ కొనసాగించాలో తెలియక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్ ను రద్దు చేసిన సర్కార్ ఇంటర్ సెకండియర్ పరీక్షలను వాయిదా వేసింది. ఫస్ట్ ఇయర్ విద్యార్థులను పరీక్షలకు సంబంధం లేకుండానే సెకండియర్ కు ప్రమోట్ చేసింది.

    అయితే.. ఈ సెకండ్ ఇయర్ పరీక్షలు ఎప్పుడు ఉంటాయో తెలియని పరిస్థితి. మరో వైపు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎంసెట్, నీట్ పరీక్ష కూడా అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా? లేదా? అన్నది కూడా సందేహంగా మారింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇంటర్ బోర్డు విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తొలగించేందుకు చర్యలు ప్రారంభించింది. విద్యార్థుల్లో వ్యక్తమవుతున్న సందేహాలు తీర్చేందుకు వారిలో మానసిక ఆందోళన తగ్గించేందుకు మానసిక నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించాలని నిర్ణయించింది. ఇందు కోసం ఏడుగురు మానసిక నిపుణలతో ప్యానల్ ఏర్పటు చేసింది ఇంటర్ బోర్డు. ఈ ప్యానల్ సభ్యుల ఫోన్ నంబర్లను శనివారం బోర్డు విడుదల చేసింది.

    ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసిన మానసిక నిపుణుల ప్యానల్ సభ్యుల పేర్లు, వారి ఫోన్ నంబర్ల వివరాలు ఇవే..
    1. డాక్టర్ మజహార్ అలి(సీనియర్ సైకియాట్రిస్ట్)-9154951977
    2. డాక్టర్ రజిని(క్లినికల్ సైకాలజిస్ట్)-9154951695
    3. పీ జవహర్ లాల్ నెహ్రూ(క్లినికల్ సైకాలజిస్ట్)-9154951699
    4. ఎస్ శ్రీలత(క్లినికల్ సైకాలజిస్ట్)-9154951703
    5. శైలజ పీసపాటి(క్లినికల్ సైకాలజిస్ట్)-9154951706
    6. అనుపమ గుట్టిందేవి(క్లినికల్ సైకాలజిస్ట్)-9154951687
    7. డాక్టర్ అనిత ఆరే(క్లినికల్ సైకాలజిస్ట్)-9154951704

    విద్యార్థులు పైన సూచించిన నిపుణుల ఫోన్ నంబర్లకు కాల్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవడంతో పాటు సలహాలను పొందవచ్చు. పరీక్షల పట్ల వారు ఫీల్ అవుతున్న ఇబ్బందిని వారికి తెలిపి తగు కౌన్సెలింగ్ పొందవచ్చు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్ బోర్డు అధికారులు సూచిస్తున్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు