రీ వాల్యూయేషన్ రిజల్ట్స్‌లోనూ ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం.. చనిపోయిన అనామిక మార్కుల వెల్లడిలోనూ తప్పిదం..

శనివారం మాత్రం తప్పిన వారందరి ఆన్సర్‌షీట్స్‌ని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ క్రమంలోనే అనామిక మార్కులు పరిశీలించగా 20 నుంచి 48కి పెరిగినట్లుగా కనిపించింది. ఇది ఇంటర్ బోర్డు దృష్టికి ఎలాగోలా వెళ్లింది... దాంతో స్పందించిన బోర్డు.. ‘లేదు లేదు.. అనామిక పాస్ కాలేదు.. మొదట్లో ప్రకటించినట్లుగా 21 మార్కులు మాత్రమే వచ్చాయి’ అని ప్రకటించింంది. క్లరికల్ పొరపాటు కారణంగానే మార్కులు ఇలా తప్పుగా అప్‌లోడ్ అయ్యాయని బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు.

news18-telugu
Updated: June 2, 2019, 11:50 AM IST
రీ వాల్యూయేషన్ రిజల్ట్స్‌లోనూ ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం.. చనిపోయిన అనామిక మార్కుల వెల్లడిలోనూ తప్పిదం..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: June 2, 2019, 11:50 AM IST
ఎన్నడూ లేని విధంగా ఈ సారి తెలంగాణ ఇంటర్ బోర్డు తప్పుల మీద తప్పులు చేస్తూ స్టూడెంట్స్ ప్రాణాలు తీస్తోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో స్టూడెంట్స్ ఇంటర్ బోర్డు నిర్లక్ష్యానికి ప్రాణాలు తీసుకోగా.. తాజాగా మరో విద్యార్థి కూడా ఆ నిర్లక్ష్యానికి బలైందిది. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌కి చెందిన అనామిక హైదరాబాద్‌లోనే తన అమ్మమ్మ వాళ్లింట్లో ఉండి చదువుకుంటోంది. 20 రోజుల క్రితం.. ఇంటర్‌లో ఫెయిల్ అయ్యామంటూ 23 మంది ఆత్మహత్యకు యత్నించిన మరికొందరికి కలిపి మొత్తం 53 ఆన్సర్ షీట్స్ ఇంటర్ బోర్డు ప్రత్యేకంగా నిపుణులతో పున:పరిశీలించింది. అందులో అనామిక కూడా ఉంది. అయితే, ముందుగా అనామికకి తెలుగులో 20 మార్కులు వచ్చాయని.. రీవాల్యూయేషన్ తర్వాత ఒక మార్కు పెరిగి మొత్తం 21 మార్కులు వచ్చాయని బోర్డు వెల్లడించింది...

అయితే.. శనివారం మాత్రం తప్పిన వారందరి ఆన్సర్‌షీట్స్‌ని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ క్రమంలోనే అనామిక మార్కులు పరిశీలించగా 20 నుంచి 48కి పెరిగినట్లుగా కనిపించింది. ఇది ఇంటర్ బోర్డు దృష్టికి ఎలాగోలా వెళ్లింది... దాంతో స్పందించిన బోర్డు.. ‘లేదు లేదు.. అనామిక పాస్ కాలేదు.. మొదట్లో ప్రకటించినట్లుగా 21 మార్కులు మాత్రమే వచ్చాయి’ అని ప్రకటించింంది. క్లరికల్ పొరపాటు కారణంగానే మార్కులు ఇలా తప్పుగా అప్‌లోడ్ అయ్యాయని బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు.

అయితే, అనామిక విషయంలో ఇంటర్ బోర్డు నిర్లక్ష్యంతో తన చెల్లి ప్రాణం తీసుకుందని.. ఇప్పుడు ఆమెను ఎవరు తీసుకొస్తారని.. తమకుటుంబానికి ఎవరు న్యాయం చేస్తారని అనామిక సోదరి ఉదయ ప్రశ్నించారు. మరోవైపు, అనామిక తండ్రి కూడా కూతురి మరణం జీర్ణించుకోలేక అనారోగ్యానికి గురవుతున్నారు. ఆమెను చిన్ననాటి నుంచి అల్లారుముద్దుగా పెంచామని, ఇంటర్ బోర్డు తప్పిదాల వల్ల తమ కుటుంబంలోని వ్యక్తి ప్రాణం తీసుకుందని.. ఆ బాధను తమ కుటుంబమంతా అనుభవిస్తున్నామంటూ అనామిక కుటుంబం తల్లడిల్లుతోంది.

First published: June 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...