తెలంగాణలో(Telangana) ఇంటర్ పరీక్షల షెడ్యూల్(Inter Exam Schedule) విడుదలైంది. ఈ షెడ్యూల్ ప్రకారం మార్చి 15, 2023 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఈ షెడ్యల్ ను విడుదల చేసింది. ఈ పరీక్షలు(Exams) మార్చి 15 నుంచి ఏప్రిల్ 04వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2వ తేదీ వరకు ఇంటర్ ప్రాక్టికల్స్‌ను జరుపనున్నట్లు వివరించింది. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్‌ను(Ethics and Human Values Exam) 2023 మార్చి 4న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను మార్చి 6న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటల వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్ విభాగం జాయింట్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ తెలిపారు.
షెడ్యూల్ ఇలా..
మార్చి 15, 2023 ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
మార్చి 15న సెకండ్ ల్యాంగ్వేజ్ పేపర్
మార్చి 17న ఇంగ్లీష్ పేపర్
మార్చి 20న మ్యాథ్స్ పేపర్ 1ఏ / బోటనీ / పొలిటికల్ సైన్స్
మార్చి 23న మ్యాథ్స్ పేపర్ 1బీ/జూవాలజీ / హిస్టరీ
మార్చి 25న పిజిక్స్ / ఎకనామిక్స్
మార్చి 28న కెమిస్ట్రీ / కామర్స్
మార్చి 31 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ (బైపీసీ స్టూడెంట్స్ కు)
ఏప్రిల్ 03న మోడ్రన్ ల్యాంగ్వేజ్ / జియోగ్రఫీ
ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు మార్చి 16 నంచి పరీక్షలు నిర్వహించనున్నారు.
మార్చి 16న సెకండ్ ల్యాంగ్వేజ్
మార్చి 18న ఇంగ్లీష్
మార్చి 21న మ్యాథ్స్ పేపర్ 2ఏ / బోటనీ / పొలిటికల్ సైన్స్
మార్చి 24న మ్యాథ్స్ పేపర్ 2బీ/జువాలజీ / హిస్టరీ
మార్చి 27న ఫిజిక్స్ / ఎకనామిక్స్
మార్చి 29న కెమిస్ట్రీ / కామర్స్
ఏప్రిల్ 01న పబ్లిక్ అడ్మినిస్టరేషన్ పేపర్ 2 / బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ 2 )బైపీసీ స్టూడెంట్స్ కు)
ఏప్రిల్ 04న మోడ్రన్ ల్యాంగ్వేజ్ పేపర్ 2 / జియోగ్రఫీ
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Intermediate, JOBS