హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TIMS Recruitment 2021: గచ్చిబౌలిలోని టిమ్స్‌లో 199 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

TIMS Recruitment 2021: గచ్చిబౌలిలోని టిమ్స్‌లో 199 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TIMS Gachibowli Recruitment 2021 | గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్-TIMS మొత్తం 199 ఖాళీలను భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  తెలంగాణ ప్రభుత్వం గతేడాది కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి గచ్చిబౌలిలో తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్-TIMS ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆస్పత్రిలో ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 199 ఖాళీలున్నాయి. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికల్ ఆఫీసర్, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2, అసిస్టెంట్ డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్, స్టాఫ్ నర్స్, డైటీషియన్, ఫార్మాసిస్ట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది టిమ్స్. ఈ పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. ఏప్రిల్ 16, 17, 19 తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు ఉంటాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://dme.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్ ఇదే వెబ్‌సైట్‌లో ఉంటుంది. దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి, పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి వాక్ ఇన్ ఇంటర్వ్యూకు తీసుకెళ్లాలి.

  TIMS Recruitment 2021: పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఇవే...


  మొత్తం ఖాళీలు- 199

  ప్రొఫెసర్- 12

  అసోసియేట్ ప్రొఫెసర్- 23

  అసిస్టెంట్ ప్రొఫెసర్- 22

  మెడికల్ ఆఫీసర్- 94

  నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2- 1

  అసిస్టెంట్ డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ లేదా హెడ్ నర్స్- 6

  స్టాఫ్ నర్స్- 32

  డైటీషియన్- 1

  ఫార్మాసిస్ట్- 8

  SBI Youth for India Fellowship 2021: డిగ్రీ పాస్ అయినవారికి గుడ్ న్యూస్... రూ.50,000 ఫెలోషిప్

  DSSSB Teacher Recruitment 2021: గుడ్ న్యూస్... 12,065 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

  TIMS Recruitment 2021: డిపార్ట్‌మెంట్ వారీగా ఖాళీల వివరాలు ఇవే...


  బయో కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్- 1

  బయో కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్- 1

  ప్యాథాలజీ ప్రొఫెసర్- 1

  ప్యాథాలజీ అసోసియేట్ ప్రొఫెసర్- 1

  మైక్రో బయాలజీ ప్రొఫెసర్- 1

  జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్- 4

  జనరల్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్- 8

  జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్- 8

  టీబీసీడీ ప్రొఫెసర్- 3

  టీబీసీడీ అసోసియేట్ ప్రొఫెసర్- 8

  టీబీసీడీ అసిస్టెంట్ ప్రొఫెసర్- 10

  రేడియో డయాగ్నసిస్ ప్రొఫెసర్- 1

  రేడియో డయాగ్నసిస్ అసోసియేట్ ప్రొఫెసర్- 1

  అనస్థీషియా ప్రొఫెసర్- 2

  అనస్థీషియా అసోసియేట్ ప్రొఫెసర్- 4

  అనస్థీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్- 3

  Teacher Jobs: మొత్తం 3400 టీచర్ ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

  India Post GDS Results 2021: పోస్ట్ ఆఫీస్ అభ్యర్థులకు అలర్ట్... ఫలితాలు ఎప్పుడంటే

  TIMS Recruitment 2021: వాక్ ఇన్ ఇంటర్వ్యూ వివరాలు


  ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2, అసిస్టెంట్ డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్, డైటీషియన్ పోస్టులు- 2021 ఏప్రిల్ 16 ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు

  స్టాఫ్ నర్స్, ఫార్మాసిస్ట్- 2021 ఏప్రిల్ 17 ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు

  సివిల్ అసిస్టెంట్ సర్జన్ లేదా మెడికల్ ఆఫీసర్- 2021 ఏప్రిల్ 19 ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు

  TIMS Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


  విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో చూడొచ్చు.

  ఇంటర్వ్యూ జరిగే స్థలం- తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్, గచ్చిబౌలి, రంగారెడ్డి జిల్లా.

  వయస్సు- 2021 జూలై 1 నాటికి 18 నుంచి 34 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు గరిష్ట వయస్సు 65 ఏళ్లు.

  TIMS Recruitment 2021: వేతనాల వివరాలు ఇవే...


  ప్రొఫెసర్- రూ.1,90,000

  అసోసియేట్ ప్రొఫెసర్- రూ.1,50,000

  అసిస్టెంట్ ప్రొఫెసర్- రూ.1,25,000

  మెడికల్ ఆఫీసర్- రూ.40,270

  నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 2- రూ.35,120

  అసిస్టెంట్ డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ లేదా హెడ్ నర్స్- రూ.29,760

  స్టాఫ్ నర్స్- రూ.25,140

  డైటీషియన్- రూ.35,120

  ఫార్మాసిస్ట్- రూ.21,230

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: CAREER, Exams, Government jobs, Govt Jobs 2021, Hyderabad, Hyderabad news, Job notification, JOBS, NOTIFICATION, Telangana, Telangana jobs, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu, Tspsc jobs, Upcoming jobs

  ఉత్తమ కథలు