Home /News /jobs /

TELANGANA ICET HALL TICKETS DOWNLOAD FROM 18TH OF THIS MONTH AND EXAM DATES ON JULY 27 28 KNOW DETAILS VB

TS ICET Hall Tickets: ఆ రోజు నుంచి టీఎస్ ఐసెట్ హాల్ టికెట్స్ డౌన్ లోడ్.. పరీక్ష తేదీలు ఖరారు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ ఐసెట్)-2022 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్య రుసుముతో ఈ నెల 23 వరకు గడువు ఉంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్లు, పరీక్షల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే హాల్ టికెట్స్ డౌన్ లోడ్ తేదీని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

ఇంకా చదవండి ...
తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ICET - 2022)కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 6 నుంచి ప్రారంభం అయింది. ఆలస్య రుసుముతో ఈ నెల 23 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అధికారులు అవకాశం కల్పించారు. రూ.250 అపరాధ రుసుముతో ఈనెల 14 వరకు దరఖాస్తు(Application) చేసుకోవచ్చని టీఎస్‌ ఐసెట్‌ కన్వీనర్, కాకతీయ వర్సిటీ కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం ప్రొఫెసర్‌ కె.రాజిరెడ్డి సోమవారం తెలిపారు. రూ.500 అపరాధ రుసుముతో ఈనెల 15 నుంచి 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ ఎంట్రెన్స్(Entrance) పరీక్షకు 67వేలకు పైగా దరఖాస్తులు రాగా.. గతేడాదితో పొల్చితే 1700 దరఖాస్తులు పెరిగాయి. ఆలస్య రుసుముతో దరఖాస్తు గడువు పెంచడం వల్ల ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రొఫెసర్‌ కె.రాజిరెడ్డి తెలిపారు.

Permanent Work From Home: ఆ సంస్థ ఉద్యోగులందరికీ గుడ్ న్యూస్.. శాశ్వత వర్క్ ఫ్రం హోం సదుపాయం..


ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు అందించే కాలేజీల్లో ప్రవేశాల కోసం ఐసెట్(Icet) నిర్వహిస్తారు. tsche.ac.in వెబ్‌సెట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి తరఫున వరంగల్ కాకతీయ యూనివర్సిటీ ICET 2022 ఎగ్జామ్‌ను నిర్వహించనుంది. జూలై 18 నుంచి అడ్మిట్ కార్డులు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానుండగా... ఐసెట్ పరీక్షను జూలై 27, 28 తేదీల్లో నిర్వహించనున్నారు. TS ICET 2022 కోసం దరఖాస్తు రుసుము రూ.650గా నిర్ణయించారు. దీనికి అదనంగా సర్వీస్ చార్జీలను వసూలు చేయనున్నారు. SC/ST అభ్యర్థులకు దరఖాస్తు రుసుములో రూ.200 రాయితీ పోను రూ. 450 చెల్లించాల్సి ఉంటుంది. వీటికి అదనంగా సర్వీస్ చార్జీలు వసూలు చేస్తారు. ఇక ఆలస్యంగా రుసుము దాదాపు రూ.1000 వరకు ఉండనుంది.



TS ICET 2022 కోసం అవసరమైన డాక్యుమెంట్స్..
టీఎస్ ఐసెట్ కోసం రిజిస్ట్రేషన్ చేసే ముందు ఈ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. మొత్తం అకడమిక్ రికార్డ్స్. గతం, ప్రస్తుత తరగతులకు సంబంధించిన సర్టిఫికెట్లు, స్కాన్ చేసిన రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, స్కాన్ చేసిన సంతకం కాపీ, కేటగిరి సర్టిఫికేట్( ఒకవేళ ఉంటే), దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించడానికి డెబిట్/క్రెడిట్ లేదా ఏదైనా ఇతర బ్యాంకింగ్ వివరాలు. భవిష్యత్‌లో కమ్యూనికేషన్ కోసం కాంటాక్ట్ వివరాలు, చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ ID, ఫోన్ నంబర్ తదితర వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో నమోదు లేదా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

అర్హతలు..
నోటిఫికేషన్ తేదీ నాటికి అభ్యర్థులు కనీసం 19 సంవత్సరాలు నిండి ఉండాలి. MBA కోసం, వారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి 50% మార్కులతో (రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు 45%) బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన పాసై ఉండాలి. MCA చేయలనుకునే వారు 3 సంవత్సరాల డిగ్రీ కోర్సు లేదా దానికి సమానమైన 50% మార్స్‌తో ఉత్తీర్ణులై ఉండాలి (రిజర్వ్ చేయబడిన అభ్యర్థులకు 45%) మరియు +12 లేదా గ్రాడ్యుయేషన్‌లో గణితాన్ని చదివి ఉండాలి.

పరీక్ష విధానం..
TS ICET 2022 కంప్యూటర్ బేస్డ్ పరీక్ష. ఇందులో 200 MCQలు ఉంటాయి. ఇందుకోసం రెండున్నర గంటల పాటు సమయం కేటాయించనున్నారు. ప్రశ్నాపత్రం మూడు సెక్షన్‌లుగా విశ్లేషణాత్మక సామర్థ్యం, ​​గణిత సామర్థ్యం, కమ్యూనికేషన్ సామర్థ్యంగా విభజించారు. టీఎస్ ఐసెట్ పరీక్ష ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ మీడియంలో నిర్వహిస్తారు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు కేటాయిస్తారు. నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, TS ICET 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు