హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS ICET 2021 Results: తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల.. ఈ లింక్ తో రిజల్ట్స్ చెక్ చేసుకోండి..

TS ICET 2021 Results: తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల.. ఈ లింక్ తో రిజల్ట్స్ చెక్ చేసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో ఐసెట్ పరీక్ష ఫలితాలు(TS ICET 2021 Results) కొద్ది సేపటి క్రితం విడుదల అయ్యాయి. అభ్యర్థులు https://icet.tsche.ac.in/ ఈ లింక్ తో నేరుగా తమ ఫలితాలను(ICET Results)ను చెక్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

  ఎంబీఏ, ఏంసీఏ (MBA, MCA) కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణ లో నిర్వహించిన ఐసెట్ పరీక్ష(TS ICET - 2021) ఫలితాలను(ICET Results)ను అధికారులు కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. అభ్యర్థులు ఫలితాలను https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ నుంచి నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.మొత్తం మూడు సెషన్లలో ఈ ఏడాది అగస్టు 19, 20వ తేదీల్లో అధికారులు నిర్వహించారు. తెలంగాణ, ఏపీ నుంచి ఈ పరీక్షకు దాదాపు 56,962 మంది అభ్యర్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు.  వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ(Kakatiya University)లో జరిగిన కార్యక్రమంలో ఫలితాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ లింబాద్రి విడుదల చేశారు. ఈ పరీక్షలో మొత్తం 90.09 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఫలితాల్లో హైదరాబాద్ కు చెందిన లోకేశ్ మెుదటి ర్యాంకు సాధించగా, సాయి తనూజ రెండో ర్యాంకు సాధించారు. మేడ్చల్ కు చెందిన నవీనక్షంత, రాజశేఖర చక్రవర్తి వరుసగా మూడు, నాలుగో ర్యాంకులు సాధించారు. కృష్ణా జిల్లాకు చెందిన ఆనంద్‌పాల్‌ ఐదో స్థానంలో నిలిచి సత్తా చాటారు. అభ్యర్థులు ఫలితాల కోసం ఈ కింది స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది.

  మీ రిజల్ట్ చెక్ చేసుకోండిలా..

  1. అభ్యర్థులు ముందుగా icet.tsche.ac.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.

  2. ఓపెన్ చేయగానే TS ICET result link కనిపిస్తుంది.

  3. ఆ లింక్ పై క్లిక్ చేసి లాగిన్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

  4. తర్వాత మీ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

  Engineering Students: ఇంజినీరింగ్​ విద్యార్థులకు గుడ్​న్యూస్​.. ప్రతి నెలా రూ. 7500 స్టైపెండ్​ పొందే అవకాశం.. ఎలా అంటే..

  ఐసెట్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులు రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల పరిధిలో నిర్వహిస్తున్న ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరేందుకు అవకాశం కల్పిస్తారు. కౌన్సెలింగ్ ద్వారా ఆయా కాలేజీల్లోని ఎంబీఏ, ఎంసీఏ సీట్లను భర్తీ చేస్తారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను త్వరలోనే అధికారులు విడుదల చేయనున్నారు.

  UPSC NDA Exam: ఎన్​డీఏ పరీక్షకు మహిళా అభ్యర్థులను అనుమతించాల్సిందే.. కేంద్రానికి సుప్రీంకోర్డు ఆదేశం

  ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపు, సీట్లు పొందిన కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ తదితర ప్రక్రియలు ఈ కౌన్సెలింగ్ లో ఉంటాయని అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు ప్రియారిటీ ఆధారంగా సీట్లకు ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. అభ్యర్థులు ఇప్పటి నుంచే ఏ కాలేజీలో చేరాలనే అంశంపై కసరత్తు చేయడం ద్వారా ఆప్షన్లు ఇచ్చే సమయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Exams, Results, Telangana students

  ఉత్తమ కథలు