TELANGANA HYDERABAD CITY POLICE MEGA JOB MELA ON JUNE 29 HERE IS REGISTRATION LINK NS
Job Mela in Hyderabad: నిరుద్యోగులకు శుభవార్త.. ఎల్లుండి హైదరాబాద్ పోలీసుల భారీ జాబ్ మేళా.. ఇలా రిజిస్టర్ చేసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్ సిటీ పోలీసులు (Hyderabad City Police) మరో భారీ జాబ్ మేళా(Job Mela) కు సంబంధించిన ప్రకటనను విడుదల చేశారు. ఈ జాబ్ మేళాలో 15కు పైగా కంపెనీలు పాల్గొని.. 1500 లకు పైగా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను కల్పించనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ సిటీ పోలీసులు (Hyderabad City Police) కేవలం శాంతి భద్రతల పరిరక్షణకు మాత్రమే పరిమితం కాకుండా.. సమాజ సేవలోనూ ఉందు ఉంటారు. ముఖ్యంగా యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించడంలో సిటీ పోలీసులు (City Police) తీసుకునే చొరవ అనేక సార్లు అభినందలు అందుకుంది. పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే యువతకు పోలీసుల ఆధ్వర్యంలో అనేక శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ శిబిరాల్లో ఫ్రీగా కోచింగ్ (Jobs Coaching) అందిస్తూ వారు ఉద్యోగం సాధించేలా ప్రోత్సహిస్తున్నారు. పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన అనేక మంది యువతీ యువకులు ఈ శిక్షణ శిబిరాల్లో రూపాయి కూడా ఖర్చు లేకుండా ఉచితంగా కోచింగ్ తీసుకుంటున్నారు. ఇంకా హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో భారీగా జాబ్ మేళా (Job Mela) లను సైతం నిర్వహిస్తూ ఉంటారు. ఈ జాబ్ మేళాల ద్వారా ప్రవేట్ కంపెనీల్లో వేలాది మంది యువతకు ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది తెలంగాణ పోలీస్. తాజాగా మరో జాబ్ మేళాకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ జాబ్ మేళాలో యాక్సిస్ బ్యాంక్(Axis Bank) , ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank), ఎయిర్టెల్ (Airtel) తో పాటు అనేక ప్రముఖ సంస్థలో పాల్గొని మొత్తం 1500లకు పైగా యువతీ యువకులకు ఉద్యోగావకాశాలను కల్పించనున్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 29న నిర్వహించనున్న జాబ్ మేళాకు హాజరు కావాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ ఇలా..
-అభ్యర్థులు ముందుగా ఈ లింక్ (bit.ly/jcepass) ను ఓపెన్ చేయాలి.
-అనంతరం అప్లికేషన్ ఫామ్ (Job Application Form) ఓపెన్ అవుతుంది.
-ఆ ఫామ్ లో పేరు, వయస్సు, ఫోన్ నంబర్, చిరునామా, ఈమెయిల్ ఐడీ, విద్యార్హతల వివరాలను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి. దీంతో మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) June 23, 2022
జాబ్ మేళా నిర్వహించు చిరునామా:
రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 29 (బుధవారం) ఉదయం 9 గంటలకు Heritage Palace, 1-47-908/7, Musheerabad Main Rd, Musheerabad, Kavadiguda, Hyderabad-500020 చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.