TS ICET-2020: టీఎస్ ఐసెట్ కీ విడుదల..ఈ లింక్‌తో చెక్ చేసుకోండి

TS ICET-2020: టీఎస్ ఐసెట్-2020 కీని నేడు అధికారులు విడుదల చేశారు. కీలో ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 10లోగా తమకు పంపించాలని నిర్వాహకులు సూచించారు.

news18-telugu
Updated: October 7, 2020, 5:29 PM IST
TS ICET-2020: టీఎస్ ఐసెట్ కీ విడుదల..ఈ లింక్‌తో చెక్ చేసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(TS ICET-2020) కీ విడుదలైంది. పరీక్ష రాసిన విద్యార్థులు https://icet.tsche.ac.in వెబ్ సైట్ లో కీ ని చూసుకోవచ్చు. సెషన్ల వారీగా నిర్వహించిన పరీక్ష పేపర్లు, వాటికి సంబంధించిన సమాధానాలను వెబ్ సైట్ లో పొందుపరిచారు. కీ విషయంలో ఏమైనా అభ్యంతరాలుంటే convenertsicet2020@gmail.com మెయిల్ కు ఈ నెల 10 వ తేదీలోగా పంపించాలని అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. అభ్యంతరాలను పంపించేవారు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన వివరాల కోసం ఈ Direct Link పై క్లిక్ చేయండి.

TS ICET Key Link

TS ICET ను ఈ సారి కాకతీయ యూనివర్సిటీ నిర్వహించింది. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 1 వరకు ఈ పరీక్ష జరిగింది. ఇందులో అర్హత సాధించిన విద్యార్థులు తెలంగాణలోని పలు యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది. టీఎస్ ఐసెట్‌ పరీక్షకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి మొత్తం 58,452 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రెండు రాష్ట్రాల్లోని 70 పరీక్ష కేంద్రాలలో ఈ పరీక్ష నిర్వహించారు.
Published by: Nikhil Kumar S
First published: October 7, 2020, 5:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading