కరోనా (Corona) నేపథ్యంలో రెండేళ్లుగా పరీక్షలన్నీ (Exams) సమయానికి జరగడం లేదు. ఏ పరీక్ష ఎప్పుడు జరుగుతుందో తెలియని దుస్థితి. దీంతో విద్యార్థులు (Students) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ ఏడాది అలా జరగకుండా ఉండేందుకు అధికారులు పకడ్భందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందు కోసం పక్కాగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చర్యలు ప్రారంభించింది. వివిధ ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లను నియమించింది. ఎంసెట్ (TS EAMCET 2022) కన్వీనర్ గా గోవర్ధన్, ఈసెట్ (TS ECET 2022) కన్వీనర్ గా విజయ్ కుమార్ రెడ్డి, ఐసెట్ (TS ICET 2022) కన్వీనర్ గా రాజిరెడ్డి, పీజీఈసెట్ (TS PGECET 2022) కన్వీనర్ గా పీ లక్ష్మీనారాయణ, ఎడ్ సెట్ (TS EDCET 2022) కన్వీనర్ గా రామకృష్ణ, లాసెట్ కన్వీనర్ గా జీబీ రెడ్డిని నియమించింది ఉన్నత విద్యామండలి. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి శుక్రవారం వివరాలను వెల్లడించారు.
TS Inter Exam Fee: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్ ఫీజుపై బోర్డు కీలక ప్రకటన..
అయితే.. ప్రవేశ పరీక్షలకు సంబంధించి ఎప్పుడు నిర్వహించాలన్న అంశంపై సైతం ఉన్నత విద్యామండలి సూచన ప్రాయంగా నిర్ణయానికి వచ్చింది. జూన్ చివరి వారంలో లేదా జులై మొదటి వారంలో ఆయా పరీక్షల నిర్వహణను ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు. ఒక వేళ కేసులు ఉధృతమైనా కూడా ఫిబ్రవరి చివరి వరకు పరిస్థితి అదుపులోకి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
AP SSC Exams: కరోనా థర్డ్ వేవ్ ఎఫెక్ట్.. పదో తరగతి పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన..
Exams Postponed: కరోనా ఎఫెక్ట్.. ఆ ఎగ్జామ్స్ అన్నీ వాయిదా.. వివరాలివే..
అయితే.. కరోనా ప్రభావం ఆధారంగా ఎగ్జామ్ తేదీలు మారే అవకాశం ఉంటుంది. గతేడాది సైతం జూన్ నెలాఖరులో పరీక్షలను ప్రారంభించాలని ఉన్నత విద్యామండలి భావించింది. కానీ కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు నుంచి ఆయా ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ను ప్రారంభించాల్సి వచ్చింది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.