హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana: సీటు ఎక్కడొచ్చినా.. క్లాసులు మాత్రం నచ్చిన కాలేజీలో వినొచ్చు.. తెలంగాణలో సరికొత్త ప్రయోగం

Telangana: సీటు ఎక్కడొచ్చినా.. క్లాసులు మాత్రం నచ్చిన కాలేజీలో వినొచ్చు.. తెలంగాణలో సరికొత్త ప్రయోగం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో విద్యా విధానంలో సంచలన మార్పులు తీసుకువచ్చేందుకు ఉన్నత విద్యామండలి యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చాలా మంది విద్యార్థులు నచ్చిన కాలేజీలో చేరలేకపోయామని నిరాశ చెందుతూ ఉంటారు. అలాంటి వారికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి గుడ్ న్యూస్ చెప్పింది. సీటు వచ్చిన కాలేజీ కాకుండా దానికి నచ్చిన సమీపంలోని మరో కాలేజీలో కొన్ని రోజుల పాటు క్లాసులు వినే అవకాశాన్ని కల్పించేందుకు కసరత్తు చేస్తోంది. డిగ్రీ స్థాయిలో ఈ విధానాన్ని తీసుకురానున్నారు. ఇందుకోసం క్లస్టర్ విధానాన్ని తీసుకురానుంది. ఇందుకు కావాల్సిన మార్గదర్శకాలను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు లింబాద్రి, వెంకటరమణ తో పాటు పలు వైస్ ఛాన్సలర్లతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇటీవల ఏర్పటై కస్టర్ల ఏర్పాటుపై సమాలోచనలు చేసింది. కస్టర్లు ఎలా ఎర్పాటు చేయాలి? ఎన్ని కాలేజీలు కలుపుతూ ఓ క్లస్టర్ చేయాలి? తదితర అంశాలపై కమిటీ చర్చించింది. అయితే.. ఈ క్లస్టర్లలో కనీసం 6 కాలేజీలు ఉంచాలని అధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Amazon Offers: ఆన్‌లైన్ క్లాసుల కోసం ల్యాప్‌టాప్ కావాలా? విద్యార్థుల కోసం ప్రత్యేక​ సేల్

Telangana Government Jobs: తెలంగాణ యువతకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు.. ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన

ఇందులో రెండు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు, మరో రెండు యూనివర్సిటీ గుర్తింపు పొందిన ప్రైవేటు కాలేజీలు, మరో రెండు యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కాలేజీలను కలిపి ఉంచాలని అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. మొదట ఈ విధానాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి త్వరలో రాష్ట్రమంతా అమలు చేయాలన్నది అధికారుల ప్లాన్ గా తెలుస్తోంది. తొలుత హైదరాబాద్ లోని కొన్ని కాలేజీలను కలిపి క్లస్టర్ గా ఏర్పాటు చేయనున్నారు. అయితే డిగ్రీ కాలేజీలతో పాటు హైదరాబాద్ ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, సెంట్రల్ యూనివర్సిటీ, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సహా ఇతర యూనివర్సిటీలు జాతీయ, అంతర్జాతీ సంస్థలను క్లస్టర్ విధానంలో చేర్చాలని అధికారులు యోచిస్తున్నారు.

Exam Results: నేడు ఆ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.. పూర్తి వివరాలివే..

ఈ విధానం ద్వారా క్లస్టర్ లోని ఓ కాలేజీలో పని చేసే సిబ్బంది మరో కాలేజీలో బోధించే అవకాశం కల్పిస్తారు. దీంతో పాటు ల్యాబ్ లు, మెటీరియల్, లైబ్రరీ తదితర సదుపాయాలను పరస్పరం వాడుకునే అవకాశం కల్పిస్తారు. తద్వారా సదుపాయాలు తక్కువ కలిగిన కాలేజీల్లో చేరిన విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ క్లస్టర్ విధానం అమల్లోకి తీసుకురావాలన్నది ఉన్నత విద్యామండలి ఆలోచనగా తెలుస్తోంది.

First published:

Tags: Degree exams, Degree students, EDUCATION, Online Education, Telangana

ఉత్తమ కథలు