హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

High Court Results | Exam Schedule: తెలంగాణ హైకోర్టు టెక్నికల్ పోస్టుల ఫలితాలు విడుదల.. కొత్త పరీక్షల షెడ్యూల్ ఇదే..

High Court Results | Exam Schedule: తెలంగాణ హైకోర్టు టెక్నికల్ పోస్టుల ఫలితాలు విడుదల.. కొత్త పరీక్షల షెడ్యూల్ ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ హైకోర్టు 2022 మార్చిలో వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించి పులు నోటిఫికేషన్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. వాటికి పరీక్షలను కూడా నిర్వహించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

తెలంగాణ హైకోర్టు 2022 మార్చిలో వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించి పులు నోటిఫికేషన్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. వాటికి పరీక్షలను కూడా నిర్వహించింది. తాజాగా టెక్నికల్ పోస్టులకు ఫలితాలు విడుదలయ్యాయి. వీటిలో కాపీయిస్ట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ వంటి విభాగాలు ఈ పోస్టులున్నాయి. వివిధ జిల్లాల్లో ఖాళీ పోస్టులకు నిర్వహించిన ఈ పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థుల యొక్క జాబితాలను విడుదల చేశారు. ఫలితాల కొరకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. దీని కోసం ఇక్కడ  క్లిక్ చేయండి.

ఇదిలా ఉండగా.. ఇటీవల తెలంగాణ హైకోర్టు(Telangana High court) నుంచి భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలయిన విషయం తెలిసిందే. జనవరి మొదటి వారంలో జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు 6 నోటిఫికేషన్లకు పైగా విడుదల చేసిన హైకోర్టు(High Court).. జనవరి 11న మరో 9 నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం 15 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాగా.. దరఖాస్తుల ప్రక్రియ కూడా ముగిసింది. అయితే వీటికి సంబంధించి పరీక్ష తేదీలు విడుదల అయ్యాయి. వాటి గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మొదట హైకోర్టులో ఖాళీ పోస్టులకు 9 నోటిఫికేషన్లు విడుదల కాగా.. వీటికి సంబంధించి పరీక్షలు మార్చి 31 , ఏప్రిల్ 01, 2023 రెండు రోజులు నిర్వహించనుంది. మార్చి 31న మూడు షిప్ట్ లో పరీక్ష ఉంటుంది. పోస్టుల వారీగా పరీక్ష తేదీల వివరాలిలా..

1. అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి 31 మార్చి 2023న మొదటి షిఫ్ట్ లో నిర్వహించనున్నారు. సమయం ఉదయం 9 గంటల నుంచి 10.30 వరకు ఉంటుంది.

2. ఎగ్జామినర్ ఉద్యోగాలకు సంబంధించి కంప్యూటర్ బేస్డ్ విధానంలో 31 మార్చి 2023న సెకండ్ షిప్ట్ లో ఉంటుంది. సమయం ఉదయం 12.30 గంటల నుంచి 02.00 వరకు ఉంటుంది.

General Knowledge: రాజధాని లేని దేశం ఏది..? మీ జనరల్ నాలెడ్జ్ ని చెక్ చేసుకోండిలా..

3. సిస్టమ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్ష 31 మార్చి 2023న థర్డ్ షిప్ట్ లో ఉంటుంది. సమయం 04.00 గంటల నుంచి 05.30 వరకు ఉంటుంది.

4. ట్రాన్స్ లేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు ఏప్రిల్ 01, 2023న ఒక్కటే షిప్ట్ లో నిర్వహించనున్నారు.

ఇక తెలంగాణ జిల్లాలో కోర్డుల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు పరీక్ష తేదీలు ఇలా ఉన్నాయి.

1.జూనియర్ అసిస్టెంట్ (క్లస్టర్ 03) ఉద్యోగాలకు ఏప్రిల్ 03, 2023న ఉదయం మొదటి షిప్ట్ లో ఉంటుంది. క్లస్టర్ 01 సెకండ్ షిప్ట్ లో ఉండగా.. జూనియర్ అసిస్టెంట్ క్లస్టర్ 02 థర్డ్ షిప్ట్ లో ఉంటుంది.

2. రికార్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఏప్రిల్ 04, 2023న రెండు షిప్ట్ లల్లో పరీక్షను ఆన్ లైన్ విధానంలో నిర్వహించనున్నారు.

3.ఎగ్జామినర్ పోస్టులకు ఏప్రిల్ 04, 2023న చివరి షిప్ట్ లో పరీక్షను ఆన్ లైన్ విధానంలో నిర్వహించనున్నారు.

4.ఫిల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఆన్ లైన్ పరీక్ష ఒకే షిప్ట్ లో ఏప్రిల్ 05, 2023న నిర్వహించనున్నారు.

వీటికి హాల్ టికెట్స్ విడుదల మార్చి 23, 2023 నుంచి అవుతాయి. అంటే వారం ముందు ఈ హాల్ టికెట్స్ ను అధికారిక వెబ్ సైట్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీనికి డైరెక్ట్ లింక్ ఇక్కడ క్లిక్ చేయవచ్చు.

First published:

Tags: JOBS, Telangana, Telangana jobs, Ts high court

ఉత్తమ కథలు