హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS Govt Jobs: తెలంగాణ యువతకు సంక్రాంతి కానుక.. మరో 9 నోటిఫికేషన్లు విడుదల.. పూర్తి వివరాలివే!

TS Govt Jobs: తెలంగాణ యువతకు సంక్రాంతి కానుక.. మరో 9 నోటిఫికేషన్లు విడుదల.. పూర్తి వివరాలివే!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ హైకోర్టు రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లోని ఖాళీల భర్తీకి ఏకంగా 9 జాబ్ టిఫికేషన్లను విడుదల చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ హైకోర్టు రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లోని ఖాళీల భర్తీకి ఏకంగా 9 జాబ్ నోటిఫికేషన్లను (Telangana Job Notifications) విడుదల చేసింది. ఆఫీస్‌ సబార్డినేట్‌ తో పాటు పలు పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మొత్తం 176 ఖాళీలను (Telangana Jobs) భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ 176 ఖాళీల్లో 72 పోస్టులను మహిళలకు కేటాయించారు.

ఖాళీలు వివరాలు:

S.No.పోస్టులుఖాళీలు
1.హైకోర్టు సబార్డినేట్‌50
2.సిస్టమ్‌ అసిస్టెంట్‌45
3.ఎగ్జామినర్లు17
4.అసిస్టెంట్లు10
5.యూడీ స్టెనోలు2
6.అసిస్టెంట్‌ లైబ్రేరియన్లు2
7.కంప్యూటర్‌ ఆపరేటర్లు20
8.ట్రాన్స్‌లేటర్లు10
9.కోర్టు మాస్టర్లు/ హైకోర్టు జడ్జిల వ్యక్తిగత కార్యదర్శులు20

దరఖాస్తు ప్రక్రియ:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 11 ఆఖరి తేదీ. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. నియామక పరీక్షను మార్చిలో నిర్వహించనున్నాట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. హాల్‌ టికెట్లు ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు.

నోటిఫికేషన్ల లింక్: https://tshc.gov.in/

First published:

Tags: JOBS, Telangana government jobs, Telangana High Court

ఉత్తమ కథలు