Home /News /jobs /

TELANGANA HIGH COURT RECRUITMENT CELL INVITES APPLICATIONS FOR 1539 POSTS APPLY BEFORE SEPTEMBER 18 SS

High Court Jobs: హైకోర్టులో 1539 ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

High Court Jobs: హైకోర్టులో 1539 ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్
(ప్రతీకాత్మక చిత్రం)

High Court Jobs: హైకోర్టులో 1539 ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్ (ప్రతీకాత్మక చిత్రం)

TS High Court Jobs | ఈ పోస్టులకు టెన్త్, ఇంటర్ అర్హత. ఆసక్తిగల అభ్యర్థులు www.hc.ts.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.

    టెన్త్ లేదా ఇంటర్ పాసైనవారికి గుడ్ న్యూస్. తెలంగాణ హైకోర్టులో భారీగా ఉద్యోగాలున్నాయి. మొత్తం 1539 ఖాళీల భర్తీకి తెలంగాణ హైకోర్టు రిక్రూట్‌మెంట్ సెల్ చాలా కాలం క్రితమే నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు గడువును కూడా పొడిగించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు సెప్టెంబర్ 18 చివరి తేదీ. రికార్డ్ అసిస్టెంట్, స్టెనో, కాపీయిస్ట్, ప్రాసెస్ సర్వర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది తెలంగాణ హైకోర్టు రిక్రూట్‌మెంట్ సెల్. ఈ పోస్టులకు టెన్త్, ఇంటర్ అర్హత. ఆసక్తిగల అభ్యర్థులు www.hc.ts.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. ఉద్యోగాల భర్తీకి తెలంగాణ హైకోర్టు జారీ చేసిన నోటిఫికేషన్‌తో పాటు జిల్లాల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

    Telangana High Court Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


    మొత్తం పోస్టులు- 1539
    ఆఫీస్ సబ్‌ఆర్డినేట్- 686
    జూనియర్ అసిస్టెంట్- 277
    టైపిస్ట్- 146
    కాపీయిస్ట్- 122
    ప్రాసెస్ సర్వర్- 127
    ఫీల్డ్ అసిస్టెంట్- 65
    స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3- 54
    ఎగ్జామినర్- 57
    రికార్డ్ అసిస్టెంట్- 05

    విద్యార్హత- కాపీయిస్ట్, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. ప్రాసెస్ సర్వర్ పోస్టుకు 10వ తరగతి పాసైతే చాలు.
    వయస్సు: 18 నుంచి 34 ఏళ్లు

    Moto E6S: రూ.7,999 ధరకే మోటోరోలా నుంచి కొత్త ఫోన్... ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    CISF Jobs: సీఐఎస్ఎఫ్‌లో 914 కానిస్టేబుల్ ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

    Railway Jobs: ఉత్తర రైల్వేలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

    Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
    First published:

    Tags: CAREER, Exams, High Court, JOBS, NOTIFICATION, Telangana High Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు