తెలంగాణ హైకోర్టులో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సివిల్ జడ్జి పోస్టుల్ని భర్తీ చేస్తోంది తెలంగాణ హైకోర్టు. మొత్తం 87 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 మార్చి 13న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2020 ఏప్రిల్ 13 చివరి తేదీ. http://tshc.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు ముందుగా నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 13
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఏప్రిల్ 13
హాల్ టికెట్స్ డౌన్‌లోడ్- 2020 ఏప్రిల్ 23
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్- 2020 మే 3
ప్రిలిమినరీ కీ విడుదల- 2020 మే 7
అభ్యంతరాల స్వీకరణకు చివరి తేదీ- 2020 మే 22
సివిల్ జడ్జి పోస్టులు- 87
డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేసే పోస్టులు- 70
ట్రాన్స్‌ఫర్ భర్తీ చేసే పోస్టులు- 17
విద్యార్హత- ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ. ఏదైనా కోర్టులో 3 ఏళ్లకు పైగా అడ్వకేట్‌గా పనిచేసిన అనుభవం.
వయస్సు- 25 నుంచి 35 ఏళ్లు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు- ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.1,000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500.
పరీక్షా కేంద్రాలు- హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
RRB Exam Fees Refund: ఎగ్జామ్ ఫీజు వెనక్కి ఇస్తున్న ఆర్ఆర్‌బీ... వెంటనే వివరాలు అప్‌డేట్ చేయండి
Railway Jobs: భారతీయ రైల్వేలో 2792 జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే
SSC Recruitment 2020: టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైనవారికి 1157 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Exams, High Court, Highcourt, Job notification, JOBS, NOTIFICATION, Telangana, Telangana High Court, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu