తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువు ఏప్రిల్ 13న ముగియాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా దరఖాస్తు గడువును పొడిగించింది హైకోర్టు. అభ్యర్థులు 2020 మే 15 వరకు దరఖాస్తు చేయొచ్చు. మొత్తం 87 సివిల్ జడ్జి పోస్టుల్ని భర్తీ చేస్తోంది తెలంగాణ హైకోర్టు. ఆసక్తిగల అభ్యర్థులు http://tshc.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఇక ఇప్పటికే దరఖాస్తు చేసిన అభ్యర్థులు మాక్ టెస్ట్‌కు హాజరుకావొచ్చు. http://tshc.gov.in/ వెబ్సైట్లోనే మాక్ టెస్ట్ లింక్ యాక్టివేట్ అయింది.
Telangana High Court Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...
సివిల్ జడ్జి పోస్టులు- 87
డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే పోస్టులు- 70
ట్రాన్స్ఫర్ భర్తీ చేసే పోస్టులు- 17
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 13
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మే 15
విద్యార్హత- ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ. ఏదైనా కోర్టులో 3 ఏళ్లకు పైగా అడ్వకేట్‌గా పనిచేసిన అనుభవం.
వయస్సు- 25 నుంచి 35 ఏళ్లు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు- ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.1,000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500.
పరీక్షా కేంద్రాలు- హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం.
నోటిఫికేషన్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు గడువు పొడిగిస్తూ జారీ చేసిన నోటీస్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
మాక్ టెస్ట్ లింక్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు... విశాఖపట్నంతో పాటు ఇతర నగరాల్లో ఖాళీలు
Jobs: బీటెక్ పాసైతే ఈ 259 జాబ్స్‌కు అప్లై చేయండి... వివరాలివే
Jobs: సెంట్రల్ గవర్నమెంట్ వాటర్ బోర్డులో ఉద్యోగాలు... హైదరాబాద్ రీజియన్‌లో ఖాళీలుPublished by:Santhosh Kumar S
First published:April 08, 2020, 09:19 IST